Asianet News TeluguAsianet News Telugu

బాబర్ ఆజమ్ ఒంటరయ్యాడు, ఎవరూ మాట్లాడలేదు, ఓటమి అందుకే: మోయిన్ ఖాన్

తమ జట్టులో ఐక్యత లోపించిందని, కెప్టెన్ బాబర్ ఆజమ్ ఒంటరివాడయ్యాడని పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ వికెట్ కీపర్ మొయిన్ ఖాన్ అన్నాడు. అందుకే ఆసియా కప్ టోర్నమెంటు నుంచి పాకిస్తాన్ వైదొలిగిందని ఆయన అన్నాడు.

Asia Cup 2023: Moin Khan opins there was no unit in pakistan team kpr
Author
First Published Sep 16, 2023, 8:03 PM IST

ఆసియా కప్ ఆడే సమయంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు సభ్యుల్లో ఐక్యత లేదని, దాంతోనే ఫైనల్ కు చేరకుండానే తప్పుకోవాల్సి వచ్చిందని మోయిన్ ఖాన్ అన్నారు. ఐసిసి వన్డే ర్యాంకింగులో తొలి స్థానంలో ఉన్న పాకిస్తాన్ ఆసియా కప్ సూపర్ ఫోర్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

జట్టు సభ్యుల్లో ఐక్యత లోపించిందని, కెప్టెన్ బాబర్ ఆజమ్ ఒంటరివాడయ్యాడని పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ మోయిన్ ఖాన్ జియో టీవీతో మాట్లాడుతూ అన్నారు. టోర్నమెంట్ యావత్తూ చూశామని, ఒక్క ఆటగాడు కూడా బాబర్ ఆజమ్ వద్దకు వచ్చిన దాఖలాలు కనిపించలేదని ఆయన అన్నారు. రిజ్వాన్ గానీ వైస్ కెప్టెన్ గానీ బాబర్ వద్దకు వెళ్లలేదని, ప్రతి ఒక్కరూ చెల్లాచెదురుగా విడివిడిగదా కనిపించారని ఆయన అన్నారు.

పాకిస్తాన్ జట్టు ఆసియా కప్ టోర్నమెంటులో అతి పేలవమైన ఆటను ప్రదర్శించింది. చివరి సూపర్ ఫోర్ మ్యాచులో శ్రీలంకపై పాకిస్తాన్ ఓటమి పాలైంది. దాంతో ఆసియా కప్ టోర్నమెంటు నుంచి పాకిస్తాన్ వైదొలగింది. శ్రీలంకపై మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 42 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. మొహమ్మద్ రిజ్వాన్, అబ్దుల్లా షఫీక్ అర్థ సెంచరీలో చేయడంతో ఆ స్కోరు సాధించగలిగింది. 

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక రెండు వికెట్ల తేడాతో చివరి బంతికి విజయం సాధించి ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఆ విజయంతో  పాకిస్తాన్ కంగు తింది. ఈ టోర్నమెంటును పాకిస్తాన్ బాగానే ప్రారంభించింది. బంగ్లాదేశ్ మీద 63 బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, భారత్ మీద ఘోరమైన ఓటమిని చవి చూసింది. భారత్ పై 228 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

పాకిస్తాన్ మిడిల్ ఓవర్లలో మిడిల్ ఆర్డర్ ప్రదర్శన తీరుపై దాంతో సందేహాలు వ్యక్తమయ్యాయి. స్పెషలిస్టు స్పిన్ బౌలర్లు షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్ పేలవమైన ఆటతీరును ప్రదర్శించారు. నాలుగు మ్యాచుల్లో వారు రెండు వికెట్లు మాత్రమే తీశారు. షాబాద్ 35 ఓవర్లు వేసి 218 పరుగులు సమర్పించుకున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios