Asianet News TeluguAsianet News Telugu

Asia Cup: ఫైనల్లో లంకకు కోలుకోలేని షాక్.. రెచ్చిపోతున్న పాక్ బౌలర్లు

Asia Cup 2022: ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టగా బౌలింగ్ చేస్తున్నారు.  9 ఓవర్లు ముగిసేటప్పటికే  శ్రీలంక 5 వికెట్లు కోల్పోయింది. 
 

Asia Cup 2022: Sri Lanka Lost Early 5 Wickets In Final Clash Against Pakistan
Author
First Published Sep 11, 2022, 8:26 PM IST

పూర్వవైభవం కోసం తహతహలాడుతున్న శ్రీలంక.. ఆసియా కప్ లో ఇప్పటిదాకా   ఆ దిశగా   ముందడుగులు వేసినా ఫైనల్ పోరులో తడబడుతున్నది. కీలక ఫైనల్  పోరులో పాకిస్తాన్ బౌలర్ల ధాటికి టాపార్డర్ కుప్పకూలింది. 9 ఓవర్లు  ముగిసేసమయానికి లంక  5 కీలక వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది.   పాక్ బౌలర్లలో హరీస్  రౌఫ్ 2 వికెట్లు తీయగా.. 19 ఏండ్ల కుర్రాడు నసీమ్ షా ఒక వికెట్ పడగొట్టాడు.  స్పిన్నర్ షాదాబ్ ఖాన్,  ఇఫ్తికార్ అహ్మద్ లకు తలా ఒక వికెట్ దక్కింది. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన  శ్రీలంక తొలి  ఓవర్లోనే నసీమ్ షా షాకిచ్చాడు. మూడో బంతికి  నసీమ్ షా.. ఈ సిరీస్ లో లంక విజయాలలో కీలక పాత్ర పోషించిన   కుశాల్ మెండిస్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  ఆ తర్వాత ఓవర్లో   ధనంజయ.. మహ్మద్ హస్నేన్ బౌలింగ్ లో రెండు బౌండరీలు బాదాడు.  

ఇన్నింగ్స్  4వ ఓవర్లో  హరీస్ రౌఫ్.. లంకకు మరో షాకిచ్చాడు. రౌఫ్..  4 ఓవర్ రెండో బంతికి  పతుమ్ నిస్సంక (8) ను  ఔట్ చేశాడు. నిస్సంక బాబర్ ఆజమ్ కు  క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.   

 

ఆ తర్వాత  రౌఫ్..  ఆరో ఓవర్ తొలి బంతికే గుణతిలక (1) నూ క్లీన్ బౌల్డ్ చేశాడు.  దీంతో తొలి పవర్ ప్లే ముగిసేటప్పటికీ  లంక.. 3 వికెట్లు కోల్పోయి 42 పరుగులు చేసింది.  ఇన్నింగ్స్  8వ ఓవర్ ముగిసిన ఇఫ్తికార్ అహ్మద్.. నాలుగోబంతికి ధనంజయ (21 బంతుల్లో 28, 4 ఫోర్లు) ను  పెవిలియన్ పంపాడు. దీంతో లంక పీకల్లోతు కష్టాల్లో పడింది. షాదాబ్ ఖాన్..  దసున్ శనక (2) ను బౌల్డ్ చేశాడు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios