Asia Cup 2022: ఆసియా కప్-2022లో భాగంగా  గ్రూప్ - బి లో ఉన్న బంగ్లాదేశ్.. తమ తొలి మ్యాచ్ లో అఫ్గానిస్తాన్ తో తలపడుతున్నది.  ఈ మ్యాచ్ ద్వారా ఆ జట్టు సారథి  షకిబ్ అరుదైన ఘనత అందుకున్నాడు. 

టీ20 స్పెషలిస్టు, ఆసియా కప్ - 2022లో బంగ్లాదేశ్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న షకిబ్ అల్ హసన్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఆసియా కప్ లో భాగంగా షార్జా వేదికగా అఫ్గానిస్తాన్ తో ఆడుతున్న మ్యాచ్ అతడికి టీ20లలో వందో మ్యాచ్ కావడం గమనార్హం. తద్వారా ఈ ఆల్ రౌండర్ బంగ్లాదేశ్ తరఫున వంద మ్యాచ్‌లు ఆడిన మూడో క్రికెటర్ అయ్యాడు. గతంలో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫీకర్ రహీమ్, మహ్మదుల్లాలు ఈ జాబితాలో షకిబ్ కంటే ముందున్నారు. 

జింబాబ్వే తో వన్డే సిరీస్ ఓటమితో సారథిగా తప్పుకున్న మహ్మదుల్లా స్థానాన్ని షకిబ్ భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇది అతడి కెరీర్ లో వందో మ్యాచ్ కావడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అతడిని షార్జా స్టేడియంలో మ్యాచ్ కు ముందు చిరు సన్మానం అందించింది. 

2006 నవంబర్ లో జింబాబ్వేతో మ్యాచ్ ద్వారా టీ20లలో అరంగేట్రం చేసిన షకిబ్.. తన సుదీర్ఘ కెరీర్ లో వంద మ్యాచ్ లు పూర్తి చేసుకున్నాడు. బంతితో పాటు బ్యాట్ తోనూ రాణించే ఈ స్టార్ ఆల్ రౌండర్.. ఇప్పటివరకు 99 మ్యాచ్ లలో బ్యాట్ తో 2,010 పరుగులు చేశాడు. ఇందులో పది హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక బంతితో 121 వికెట్లు పడగొట్టాడు. టీ20 క్రికెట్ (అంతర్జాతీయ) లో టిమ్ సౌథీ (114), రషీద్ ఖాన్ (112), లసిత్ మలింగ (107) లు వందకు పైగా వికెట్లు తీసిన జాబితాలో ఉన్నారు.

Scroll to load tweet…

అఫ్గాన్ తో మ్యాచ్ లో బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా.. 

ఆసియా కప్-2022లో భాగంగా అఫ్గాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్ లో లంకను చిత్తుగా ఓడించిన అఫ్గాన్.. అదే ఉత్సాహంతో బరిలోకి దిగింది. 4 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ 2 వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. ఓపెనర్లు నయీమ్, అనాముల్ హక్ లు పెవిలియన్ చేరారు. ప్రస్తుతం షకిబ్ అల్ హసన్, ముష్ఫీకర్ రహీమ్ క్రీజులో ఉన్నారు.

Scroll to load tweet…