Asianet News TeluguAsianet News Telugu

Asia Cup: ఆసియా కప్ ఫైనల్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్.. లంక బ్యాటింగ్

Asia Cup 2022 Final Live:  ఆసియా కప్  ఫైనల్  సమరం మొదలైంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్ లో పాకిస్తాన్ -  శ్రీలంక ల మధ్య కీలక సమరాకి  తెరలేచింది. 

Asia Cup 2022: Pakistan won the toss and  Elected To Field First Against Sri lanka
Author
First Published Sep 11, 2022, 7:10 PM IST

గడిచిన మూడు ఆదివారాలుగా  యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ తుది అంకానికి చేరింది.  ఇప్పటికే ఫైనల్ చేరిన  శ్రీలంక, పాకిస్తాన్ జట్లు నేడు దుబాయ్ వేదికగా జరుగుతున్న ఫైనల్ లో  తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్  తొలుత  ఫీల్డింగ్ ఎంచుకుంది. దుబాయ్ లో టాస్ కీలకపాత్ర పోషిస్తున్న తరుణంలో మరి టాస్  ఓడిన  శ్రీలంక  ఈ మ్యాచ్ లో  గెలుస్తుందా..? లేదా..? అనేది మరో నాలుగు గంటల్లో తేలనుంది. సూపర్-4 లో లంక పై ఓడినదానికి పాకిస్తాన్ బదులు తీర్చుకోవాలని భావిస్తుండగా.. అదే ఫలితాన్ని రిపీట్ చేయాలని శ్రీలంక భావిస్తున్నది. 

ఈ మ్యాచ్ లో  పాకిస్తాన్ లో గత మ్యాచ్ లో ఆడని షాదాబ్ ఖాన్, నసీమ్ షా తిరిగి జట్టుతో చేరారు. లంక జట్టులో మార్పులేమీ లేవు.  సూపర్-4  చివరి మ్యాచ్ లో బరిలోకి దిగిన ఆ జట్టే ఈమ్యాచ్ లోనూ బరిలోకి దిగుతున్నది. 

ఆసియా కప్ లో భాగంగా దుబాయ్ లో ముగిసిన గత 8 మ్యాచుల్లో  టాస్ గెలిచి  ఛేదన చేసిన జట్లే 6 సార్లు గెలిచాయి. 

 

తుదిజట్లు : 

శ్రీలంక :  దసున్ శనక (కెప్టెన్), కుశాల్ మెండిస్, పతుమ్ నిస్సంక, దనుష్క గుణతిలక, ధనంజయ డి సిల్వ, భానుక రాజపక్స, వనిందు హసరంగ, చమీక కరుణరత్నె, ప్రమోద్ మదుషన్, మహేశ్ తీక్షణ, దిల్షాన్ మధుశంక 

పాకిస్తాన్ :  బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్,ఫకర్ జమాన్, ఇఫ్తికార్  అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, షాదాబ్  ఖాన్, అసిఫ్ అలీ, హరీస్ రౌఫ్, నసీమ్ షా, మహ్మద్ హస్నేన్ 

 

Follow Us:
Download App:
  • android
  • ios