Asianet News TeluguAsianet News Telugu

ఆసియా కప్ 2022 ప్రీ-ఫైనల్ మ్యాచ్: పాక్‌ని చుట్టేసిన లంక బౌలర్లు... ఫైనల్‌కి ముందు...

19.1 ఓవర్లలో 121 పరుగులకి ఆలౌట్ అయిన పాకిస్తాన్... మూడు వికెట్లు తీసిన వానిందు హసరంగ...

Asia Cup 2022: Pakistan failed to score high total against Sri Lanka
Author
First Published Sep 9, 2022, 9:25 PM IST

ఆసియా కప్ 2022 ఫైనల్ చేరిన పాకిస్తాన్, శ్రీలంక జట్లు, నేడు సూపర్ 4 రౌండ్‌లో తలబడుతున్నాయి. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌కి ముందు ఇది ప్రీ-ఫైనల్ మ్యాచ్‌గా, ఫైనల్ వార్మప్ మ్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్... ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు కెప్టెన్ దసున్ శనక ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, 19.1 ఓవర్లలో 121 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఈ టోర్నీలో వరుసగా విఫలమవుతూ వస్తున్న బాబర్ ఆజమ్, టాప్ 2 స్కోరర్‌గా ఉన్న మహ్మద్ రిజ్వాన్ కలిసి నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించారు..

14 బంతులాడిన ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయిన నెం.1 టీ20 బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 14 పరుగులు చేసి ప్రమోద్ మదుషాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 18 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు చేసిన ఫకార్ జమాన్‌ని కరుణరత్నే అవుట్ చేశాడు...

29 బంతుల్లో 2 ఫోర్లతో 30 పరుగులు చేసిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, వానిందు హసరంగ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఇఫ్తికర్ అహ్మద్ 17 బంతుల్లో ఓ సిక్సర్‌తో 13 పరుగులు చేసి హసరంగ బౌలింగ్‌లోనే బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే అసిఫ్ ఆలీని గోల్డెన్ డకౌట్ చేశాడు వానిందు హసరంగ... 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్.

కుష్‌దిల్ షా 4 పరుగులు చేసి ధనంజయ డి సిల్వ బౌలింగ్‌లో అవుట్ కాగా ఉస్మాన్ ఖదీర్ 3 పరుగులు చేశాడు. 18 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 26 పరుగులు చేసిన మహ్మద్ నవాజ్ రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు... హరీస్ రౌఫ్‌ 1 పరుగుకే అవుట్ కావడంతో 121 పరుగులకే ఆలౌట్ అయ్యింది పాకిస్తాన్...

వానిందు హసరంగ 21 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా మహీశ్ తీక్షణ, ప్రమోద్ మధుషాన్ రెండేసి వికెట్లు తీశారు. ధనంజయ డి సిల్వ, ఛమీరా కరుణరత్నేలకు చెరో వికెట్ దక్కింది.

Follow Us:
Download App:
  • android
  • ios