Asianet News TeluguAsianet News Telugu

విరాట్ కోహ్లీకి స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చిన హంగ్ కాంగ్ టీమ్... ఓ తరానికి ఆదర్శంగా నిలిచావంటూ...

టీమిండియాతో మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీకి స్పెషల్ జెర్సీ బహుకరించిన హంగ్ కాంగ్ టీమ్... ఓ తరానికి ఆదర్శంగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుతూ....

Asia Cup 2022: Hong Kong team special gesture to Virat Kohli gifts Jersey with message
Author
First Published Sep 1, 2022, 1:55 PM IST

ఆసియా కప్ 2022 ఆరంభానికి ముందు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ గురించి చాలా పెద్ద చర్చే జరిగింది. ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీని ఆడించడం కంటే, ఫామ్‌లో ఉన్న కుర్రాళ్లకు టీ20ల్లో అవకాశం ఇవ్వాలని కపిల్ దేవ్‌తో పాటు చాలామంది మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు...

కీలక టోర్నీకి ముందు వెస్టిండీస్ టూర్‌కి, జింబాబ్వే టూర్‌కి దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, ఆసియా కప్ 2022 మొదటి రెండు మ్యాచుల్లో మంచి పర్ఫామెన్స్ కనబరిచాడు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 34 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, హంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 బంతుల్లో  ఓ ఫోర్, 3 సిక్సర్లతో 59 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు...

ఫిబ్రవరిలో వెస్టిండీస్‌పై హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, దాదాపు ఆరు నెలల తర్వాత ఈ ఏడాది రెండో టీ20 హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 2 మ్యాచుల్లో 94 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... ఆసియా కప్ 2022 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో నిలిచాడు...

టీమిండియాతో మ్యాచ్ ముగిసిన తర్వాత హంగ్ కాంగ్ క్రికెటర్లు విరాట్ కోహ్లీని కలిసి, తమ ఫెవరెట్ క్రికెటర్ నుంచి ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్లను తీసుకున్నారు. అలాగే తిరిగి హంగ్ కాంగ్ టీమ్ జెర్సీని విరాట్ కోహ్లీకి బహుకరించింది ఆ జట్టు... 

ఆ జెర్సీపై ‘విరాట్... ఓ తరానికి ఆదర్శంగా నిలిచినందుకు ధన్యవాదాలు.. మేం నీకు అండగా ఉంటాం. ఎన్నో అద్భుతమైన రోజులు ముందున్నాయి. విత్ స్ట్రెంగ్త్, విత్ లవ్.. టీమ్ హంగ్...’ అని రాసి ఇచ్చారు హంగ్ కాంట్ టీమ్ ప్లేయర్లు..

హంగ్ కాంగ్ టీమ్ ఇచ్చిన జెర్సీని ఇన్‌స్టాలో పోస్టు చేసిన విరాట్ కోహ్లీ, ‘థ్యాంక్యూ హంగ్ కాంగ్ క్రికెట్. ఈ కానుక చాలా బాగుంది. వెరీ వెరీ స్వీట్’ అంటూ కాప్షన్ జోడించాడు.  గత దశబ్దంలో 20 వేలకు పైగా పరుగులు చేసి ఐసీసీ నుంచి ‘ప్లేయర్ ఆఫ్ ది డికేట్’ అవార్డు దక్కించుకున్న విరాట్ కోహ్లీ, 70 అంతర్జాతీయ సెంచరీలు నమోదు చేసి... అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ల జాబితాలో టాప్ 3లో ఉన్నాడు...

సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డును అందుకోగల ఒకే ఒక్కడిగా మన్ననలు దక్కించుకున్న విరాట్ కోహ్లీ, 1000+ రోజులుగా సెంచరీ చేయలేకపోయాడు. దీంతో విరాట్ కోహ్లీపై ట్రోల్స్ ఎక్కువయ్యాయి. ఇదే సమయంలో బాబర్ ఆజమ్, జో రూట్ వంటి ప్లేయర్లు అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతూ సెంచరీలు చేస్తుండడంతో విరాట్‌ కోహ్లీపై ఇన్నాళ్లు ప్రశంసలు చేసిన వాళ్లే, ఇప్పుడు ట్రోల్స్ చేయడం మొదలెట్టారు...

 

Follow Us:
Download App:
  • android
  • ios