ఆసియా కప్‌ను 2023కి వాయిదా వేసిన ఐసీసీ...జూన్‌లో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరుగుతుండడంతో నిర్ణయం...యూఏఈకి టీ20 వరల్డ్‌కప్... మీడియాతో పీసీబీ ఛైర్మెన్ కామెంట్స్...

ఈ ఏడాది భారత్‌ వేదికగా జరగాల్సిన ఆసియా కప్ 2021, 2023 ఏడాదికి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం జూన్ నెలలో భారత్‌లో ఆసియా కప్ జరగాల్సి ఉంది. అయితే ఇదే సమయంలో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో రెండు టెస్టులు నెగ్గిన భారత జట్టు, ఆఖరి టెస్టును డ్రా చేసుకున్నా ఫైనల్‌కి అర్హత సాధిస్తుంది. దీంతో జూన్‌లో జరగాల్సిన ఆసియా కప్‌ను వచ్చే 2023 ఏడాదికి వాయి వేస్తూ నిర్ణయం తీసుకుంది ఐసీసీ. ఈ విషయాన్ని పీసీబీ ఛైర్మెన్ ఎహ్సన్ మనిన్ తెలిపాడు.

అయితే మీడియాతో మాట్లాడిన ఎహ్సన్, ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ను యూఏఈ వేదికగా నిర్వహించాలని ఐసీసీ నిర్ణయం తీసుకున్నట్టు తెలపడం విశేషం. అయితే ఈ విషయంపై ఐసీసీ ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదని స్పష్టత ఇచ్చాడు పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మెన్.