Asianet News TeluguAsianet News Telugu

Asia Cup: నిలకడగా పాక్ బ్యాటింగ్.. బాబర్ పని పట్టిన భువనేశ్వర్

India Vs Pakistan: ఆసియా కప్ - 2022లో భాగంగా  పాకిస్తాన్ తో  జరుగుతున్న మ్యాచ్ లో భారత బౌలర్లు రాణిస్తున్నారు. ప్రమాదకర బాబర్ ఆజమ్ ను భువనేశ్వర్ పెవిలియన్ కు చేర్చాడు. 
 

Asia Cp 2022: Pakistan Lost 2 Early Wickets, Babar Azam gone For 10
Author
First Published Aug 28, 2022, 8:20 PM IST

భారత్-పాకిస్తాన్ మధ్య దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ - 2022 గ్రూప్ - బి రెండో మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన పాక్ జట్టు ఆదిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు  కెప్టెన్, ప్రమాదరక బాబర్ ఆజమ్ (9 బంతుల్లో 10.. 2 ఫోర్లు) ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఔటయ్యాడు. వన్ డౌన్ లో వచ్చిన ఫకర్ జమాన్ (10) కూడా  క్రీజులో ఎక్కువసేపు నిలవలేకపోయాడు.  

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన పాకిస్తాన్.. గతేడాది టీ20 ప్రపంచకప్  మాదిరిగానే ధాటిగా ఆడుతుందని భావించినా భువనేశ్వర్ ముందు ఆ జట్టు పప్పులుడకలేదు. తొలి ఓవర్లోనే కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన భువీ.. తన రెండో ఓవర్లో నాలుగో బంతికి బాబర్ ఆజమ్ ను పెవిలియన్ కు పంపాడు. 

భువీ బౌలింగ్ లో వేసిన షాట్ బంతిని బాబర్ భారీ షాట్ కు యత్నించగా.. అది కాస్తా టాప్ ఎడ్జ్ కు తాకి అర్ష్‌దీప్ సింగ్ చేతుల్లో పడింది. దీంతో పాకిస్తాన్ 15 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన ఫకర్ జమాన్.. రెండు ఫోర్లు కొట్టి  జోరుమీద కనిపించినా అవేశ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవ్లో అతడు వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

 

బాబర్ తో వచ్చిన మహ్మద్ రిజ్వాన్ (24*), ఇఫ్తికర్ అహ్మద్ (13*) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. 8 ఓవర్లు ముగిసేటప్పటికీ పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. భారత పేసర్లు నిలకడగా బౌలింగ్ చేస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios