Asianet News TeluguAsianet News Telugu

'అదో తొక్కలో పిచ్.. అక్కడ బాబర్ ఆజమ్ కాదు అశ్విన్ అయినా ట్రిపుల్ సెంచరీ చేస్తాడు..'

PAKvsENG: పాకిస్తాన్ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ రావల్పిండి వేదికగా జరుగుతున్న  తొలి టెస్టు ఆడుతున్నది. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో పరుగుల వరద పారింది.  ఇంగ్లాండ్ జట్టులో నలుగురు బ్యాటర్లు,  పాక్ జట్టులో ముగ్గురు సెంచరీల మోత మోగించారు. 

Ashwin Would Have Scored a Triple Hundred Here: Netizens Slams Michael Vaughan For his Comments on babar azam
Author
First Published Dec 4, 2022, 5:01 PM IST

పాకిస్తాన్ -ఇంగ్లాండ్ నడుమ రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో  పరుగుల రద పారుతున్నది.  ఈ టెస్టులో మొదట  బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. తొలిరోజే 506 పరుగులు చేసి రికార్డులను  సృష్టించింది.  101 ఓవర్లలోనే 657 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు  జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, హ్యారీ బ్రూక్ సెంచరీల మోత మోగించారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ కూడా  ధీటుగానే బదులిచ్చింది.   తొలి ఇన్నింగ్స్ లో పాక్ ఓపెనర్లు షఫిక్, ఇమామ్ ఉల్ హక్ తో పాటు కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా సెంచరీ కొట్టాడు.   నిస్సారమైన ఈ పిచ్ పై  పరుగుల వరద పారింది. దీంతో జీవం లేని ఈ పిచ్ ను తయారుచేయించినందుకు గాను పీసీబీ చైర్మెన్ రమీజ్ రాజాపై స్వయంగా పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్, మాజీ ఆటగాళ్లే దుమ్మెత్తిపోశారు. 

అయితే పాకిస్తాన్ ఇన్నింగ్స్ లో  బాబర్  ఆజమ్ సెంచరీ చేయడంతో ఇంగ్లాండ్ మాజీ సారథి మైకేల్ వాన్ అతడిని ఆకాశానికెత్తాడు.  బాబర్ ఆజమ్ అన్ని ఫార్మాట్లలో  అద్భుత ప్రదర్శనలు చేసే గొప్ప ఆటగాడని కొనియాడుతూ ట్వీట్ చేశాడు. బాబర్ సెంచరీ తర్వాత   ‘బాబర్ ఆజమ్  క్లాస్ యాక్ట్.  ఈ పిచ్ పై అతడికి వంద కంటే తక్కువ ఏమీ లేదు. అన్ని ఫార్మాట్లలో  ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు..’ అని  ట్వీట్ చేశాడు. 

ఇప్పుడు ఈ ట్వీట్ పై  నెటిజన్లు  వాన్ ను ఓ ఆటాడుకుంటున్నారు. బాబర్ ఆల్ ఫార్మాట్ గ్రేటెస్ట్ ప్లేయర్ అనడం  విడ్డూరంగా ఉందని అసలు బాబర్ టీ20 ఇన్నింగ్స్ లు ఈయన చూస్తాడా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే విషయమై ట్విటర్ వేదికగా పలువురు స్పందిస్తూ.. ‘అన్ని ఫార్మాట్లలోనా..? వామ్మో.. బాబర్ ఆజమ్ కూడా ఈ స్టేట్మెంట్ కు ఒప్పుకోడు..’, ‘బెస్ట్ ఇన్నింగ్సా..? అంటే ఈ పిచ్ పై మిగతావాళ్లంతా 30 పరుగులు కూడా  చేయడానికి ఇబ్బందిపడ్డారా..? ఒకసారి స్కోరుబోర్డు చూసుకో.. నీ టీమ్ వాళ్లే నలుగురు సెంచరీలు చేశారు’...

 

 

‘ఈ పిచ్ పై   అశ్విన్  బ్యాటింగ్ చేసినా ట్రిపుల్ సెంచరీ కొట్టేవాడు. నాకు బాబర్ అంటే   వ్యతిరేకత ఏమీ లేదు. కానీ ఈ సెంచరీ  అనేది పెద్ద విషయమే కాదు.  అదీగాక మీరన్నట్టు..  ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అనేది   పెద్ద జోక్.  బహుశా మీరు క్రికెట్ ను సరిగా ఫాలో అవడం లేదేమో..’, ‘మీరు టీ20 ప్రపంచకప్  ను కూడా కౌంట్ చేశారా..?’, ‘బాబర్ ఇంతవరకూ తన కెరీర్ లో  భారీ ఇన్నింగ్స్ ఆడి దానివల్ల పాకిస్తాన్ ను గెలిపించిన సందర్భాలు లేనేలేవు. మీరు బెస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మాట్స్ అని ఎలా అంటారు..? ఇది కచ్చితంగా అతడిని పరిహసించడమే..’ అని  కామెంట్ చేస్తున్నారు. 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios