బార్ వెయిటర్‌తో గంటసేపు యాషెస్ గురించి మాట్లాడిన రాహుల్ ద్రావిడ్... షాకింగ్ విషయం బయటపెట్టిన అశ్విన్..
వెస్టిండీస్‌తో జూలై 20 నుంచి రెండో టెస్టు... జానీ బెయిర్‌స్టో అవుట్ గురించి బార్ టెండర్‌తో గంట సేపు సుదీర్ఘంగా చర్చించిన రాహుల్ ద్రావిడ్..

కూల్ అండ్ కామ్‌గా కనిపించే టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌లో కనిపించని కోణాలు చాలానే ఉన్నాయి. ఓ యాడ్‌లో రాహుల్ ద్రావిడ్ అగ్రెషన్ చూసి, క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. తాజాగా టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్, రాహుల్ ద్రావిడ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టాడు..
‘‘మేం వెస్టిండీస్ టూర్‌కి వచ్చిన తర్వాత మేం ఓ బీచ్‌కి వెళ్లాం. రాహుల్ (ద్రావిడ్) భఆయ్, నాకు ఓ లెమన్ జ్యూస్ తెప్పించాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న బార్ టెండర్, వెయిటర్‌తో జానీ బెయిర్‌స్టో అవుటా? కాదా? అనే విషయం గురించి గంట సేపు వివరించాడు...
క్రికెట్ రూల్స్ గురించి, క్రీడా స్ఫూర్తి గురించి, గేమ్‌లో ప్రతీదాని గురించి వాళ్లు మాట్లాడుకున్నారు. గంట సేపు సుదీర్ఘంగా సాగిన వారి చర్చకు ఓ ముసలాయన బ్రేక్ ఇచ్చాడు... అతను వచ్చి.. ‘అతను బెయిర్‌స్టో, అతను అవుట్ అయ్యాడు. ఇక చాలించండి...’ అనడంతో ఆ డిస్కర్షన్ అక్కడితో ఆగిపోయింది..
ఇక్కడి జనాలకు కూడా క్రికెట్ గురించి ఎంత లోతైన అవగాహన ఉందో తెలిసి నాకు ఆశ్చర్యమేసింది... ఈ మొత్తం డిస్కర్షన్ అంతా విని నేను చాలా కొత్త విషయాలు కూడా నేర్చుకున్నా...’’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్..
తొలి టెస్టులో 12 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, ఐసీసీ నెం.1 టెస్టు బౌలర్‌గా కొనసాగుతున్నాడు. రెండో టెస్టులో 16 వికెట్లు తీస్తే, టెస్టుల్లో 500 వికెట్లు పూర్తి చేసుకుంటాడు రవిచంద్రన్ అశ్విన్. ఇంతకుముందు టీమిండియా నుంచి అనిల్ కుంబ్లే మాత్రమే ఈ ఫీట్ సాధించాడు.
టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టక ముందు రాహుల్ ద్రావిడ్‌కి క్రికెట్ ప్రపంచంలో మంచి ఫాలోయింగ్ ఉండేది. అయితే భారీ అంచనాలతో టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న రాహుల్ ద్రావిడ్, గడిచిన ఏడాదిన్నర- రెండేళ్లలో చెప్పుకోదగ్గ విజయాలు అందుకోలేకపోయాడు..
రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌లో సౌతాఫ్రికా టూర్‌లో టెస్టు సిరీస్ కోల్పోయిన భారత జట్టు, వన్డే సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయ్యింది. ఆసియా కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్ చేతుల్లో ఓడిన టీమిండియా, లంక చేతుల్లోనూ ఓడి ఫైనల్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది..
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భారీ అంచనాలతో బరిలో దిగిన భారత జట్టు, సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో చిత్తుగా ఓడింది..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీతో టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ గడువు ముగియనుంది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో యజ్వేంద్ర చాహాల్‌ని రిజర్వు బెంచ్‌కే పరిమితం చేయడం, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో రవిచంద్రన్ అశ్విన్‌ని ఆడించకపోవడం వంటి నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి.
వన్డే వరల్డ్ కప్ 2023 ముగిసిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రావిడ్ తప్పుకోబోతున్నట్టు సమాచారం..