Ashes 2023: యాషెస్ టెస్టు సిరీస్‌లో భాగంగా   లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో  ఆస్ట్రేలియా   స్టార్ బ్యాటర్  స్టీవ్ స్మిత్ సెంచరీతో మరో రికార్డు నెలకొల్పాడు.

యాషెస్ టెస్టు సిరీస్ రసవత్తరంగా సాగుతోంది.  బ్యాటింగ్ కు స్వర్గధామమైన లార్డ్స్‌లో పరుగుల వరద పారుతోంది.  ఆస్ట్రేలియా  తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసి ఆలౌట్ కాగా  ఇంగ్లాండ్ కూడా ధీటుగానే బదులిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు  61 ఓవర్లలోనే  నాలుగు వికెట్లు కోల్పోయి  278 పరుగులు చేసింది.  

తొలి రోజు 339 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ఆరంభించిన  ఆస్ట్రేలియా అదే జోరును కొనసాగించింది.   85  పరుగల ఓవర్ నైట్ స్కోరు వద్ద రెండో రోజు బ్యాటింగ్ కు వచ్చిన స్టీవ్ స్మిత్  సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

స్మిత్ రికార్డులు.. 

184 బంతుల్లో   15 బౌండరీల సాయంతో సెంచరీ చేసిన  స్మిత్..  ఆ తర్వాత మరో పది పరుగులు జోడించి  నిష్క్రమించాడు. టెస్టులలో  స్మిత్ కు ఇది 32వ సెంచరీ.  తద్వారా స్మిత్  పలు రికార్డులను బ్రేక్ చేశాడు.  ఆస్ట్రేలియా తరఫున టెస్టులలో అత్యధిక సెంచరీలు చేసిన వారిలో దిగ్గజ సారథి రికీ పాంటింగ్.. 41 సెంచరీలతో  ప్రథమ స్థానంలో ఉన్నాడు.  స్టీవ్ వా 32 సెంచరీలు చేశాడు. తాజాగా స్మిత్..   స్టీవ్ వా రికార్డును సమం చేశాడు.  మాథ్యూ హెడెన్ 30 సెంచరీలు  సాధించాడు.  

లార్డ్స్ లో  సెంచరీ చేయడం ద్వారా  స్మిత్.. యాషెస్ లో  అత్యధిక సెంచరీలో చేసిన రెండో ఆస్ట్రేలియా బ్యాటర్ గా నిలిచాడు.  యాషెస్ లో ఆసీస్ దిగ్గజం  సర్ డాన్ బ్రాడ్‌మన్ 19 సెంచరీలు చేశాడు.  స్మిత్ కు లార్డ్స్ సెంచరీ 12వది.  ఇంగ్లాండ్ గడ్డమీద స్మిత్ కు ఇది 8వ  సెంచరీ కావడం విశేషం.  

 

Scroll to load tweet…

ఇంగ్లాండ్ ధనాధన్.. 

బజ్‌బాల్ ఆటతో దూకుడుమీదున్న ఇంగ్లాండ్.. తొలి ఇన్నింగ్స్ లో ధాటిగానే ఆడుతోంది. జాక్ క్రాలే (48) అర్థ సెంచరీ మిస్ చేసుకోగా మరో ఓపెనర్ బెన్ డకెట్ (98) రెండు పరుగుల తేడాతో  సెంచరీ మిస్ చేసుకున్నాడు.   ఓలీ పోప్  (42)  ఫర్వాలేదనిపించాడు. తొలి టెస్టులో  సెంచరీ చేసిన జో రూట్ (10) ఈ  ఇన్నింగ్స్ లో    ప్రభావం చూపలేకపోయడు.  హ్యారీ బ్రూక్ (45 నాటౌట్), బెన్ స్టోక్స్ (17 నాటౌట్)  లు   మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు.