తాజాగా ధోనీకి చెందిన ఓ పాత వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. 


టీమిండియా క్రికెటర్లలు అందరిలో కెల్లా మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ సపరేటు. ఆయనకు మైదానంలో మాత్రమే కాదు, మైదానం బయట కూడా సూపర్ క్రేజ్ ఉంది. ఆయనను విపరీతంగా ఆరాధించే అభిమానులు ఉన్నారు. అంత మంది అభిమానులను సంపాదించుకోవడానికి కేవలం ఆయన ఆట తీరు మాత్రమే కాదు, ఆయన వ్యక్తిత్వం కూడా కారణం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఆయన ఎప్పుడూ చాలా కూల్ గా కనిపిస్తూ ఉంటారు. అందుకే ఆయనను ఫ్యాన్స్ ముద్దుగా కెప్టెన్ కూల్ అని పిలుస్తూ ఉంటారు. ఆయన కెప్టెన్ గా ఉన్నాడు కాబట్టే, చెన్నై సూపర్ కింగ్స్ కి కూడా క్రేజ్ ఎక్కువ. ఈ సంగతి పక్కన పెడితే, తాజాగా ధోనీకి చెందిన ఓ పాత వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Scroll to load tweet…

ఆ వీడియోలో ఆయన తన సెక్యూరిటీ గార్డును తన బైక్ పై ఎక్కించుకొని వెళ్లడం విశేషం. పాత వీడియో అయినప్పటికీ నెట్టింట వైరల్ గా మారింది. అందులో, ఆయన బైక్ డ్రైవ్ చేస్తూ ఉండగా, వెనక సెక్యూరిటీ గార్డును కూర్చోపెట్టుకున్నారు. అతనిని తన ఇంటి నుంచి మొయిన్ గేట్ వద్ద వదిలిపెట్టాడు.

ఈ వీడియో ఇప్పుడు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ సెక్యూరిటీ గార్డు ఎంత అదృష్టవంతుడో, ధోనీ తో కలిసి బైక్ మీద ప్రయాణించాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుండటం విశేషం.

మరి కొందరేమో ధోనీ సింప్లిసిటీ ని మెచ్చకుంటున్నారు. అంత పెద్ద సెలబ్రెటీ అయినప్పటికీ, ఎలాంటి గర్వం లేకుండా, సెక్యూరిటీ గార్డును తన బైక్ ఎక్కించుకున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు.