హైదరాబాద్: భారత మహిళల జట్టు తొలిసారి ఐసీసీ టీ20 ప్రపంచ కప్ పోటీల్లో ఫైనల్ కు చేరుకోవడంతో తాను థ్రిలయ్యాయనని భారత మహిళల వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అన్నారు. ఇంగ్లాండు మహిళల క్రికెట్ జట్టును తలుచుకుంటే బాధేస్తోందని ఆమె అన్నారు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో లీగ్ దశలో గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలువడంతో భారత్ ఫైనల్ కు చేరుకుంది. 

టీ20 ప్రపంచ కప్ పోటీల్లో తొలి సారి ఇండియా ఫైనల్ కు చేరుకోవడంతో థ్రిల్ ఫీలైనట్లు ఆమె తెలిపారు. టీ20 మహిళల జట్టును ఆమె అభినందించారు. భారతీయురాలిగా భారత్ ఫైనల్ లోకి చేరడంతో తాను థ్రిల్ ఫీలైనట్లు చెప్పారు. క్రికెటర్ గా ఇంగ్లాండు జట్టును చూస్తే బాధేస్తోందని ఆమె అన్నారు. 

తనను గానీ జట్టును గానీ ఆ రకంగా చూడడం తనకు ఇష్టం లేదని, కానీ నియమాలు అలా ఉన్నాయని, అందువల్ల అది జరిగిందని ఆమె అన్నారు. 

టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయిన భారత పేసర్ జులన్ గోస్వామి కూడా మహిళల జట్టును అభినందించారు. గ్రూప్ దశలో అద్భుతంగా ఆడిన భారత జట్టుకు ఆ ఆర్హత ఉందని ఆమె అన్నారు. 

రెండో సెమీ ఫైనల్ మ్యాచులో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఈ సెమీ ఫైనల్ మ్యాచులో గెలిచిన జట్టుతో భారత్ ఫైనల్లో తలపడుతుంది.