ఇండియన్ క్రికెటర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ తన కొడుకు కోసం హెయిర్ స్టైలిష్ గా మారిపోయారు. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో... సెలబ్రెటీలు కూడా హెయిర్ కట్స్ ఇంట్లోనే చేసుకుంటున్నారు. ఇప్పటికే కోహ్లీకి అనుష్క, సురేష్ రైనాకి ఆయన భార్య హెయిర్ కట్ చేశారు. తాజాగా సచిన్.. తన కొడుకు అర్జున్ టెండుల్కర్ కి హెయిర్ కట్ చేశారు.

అర్జున్‌కి హెయిర్‌కట్ చేసిన సచిన్ అందుకు సంబంధించిన వీడియోని తన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘‘ఒక తండ్రిగా పిల్లల కోసం ఏదైనా చేయాల్సి వస్తుంది. అది వాళ్లతో కలిసి ఆడుకోవడం, కలిసి జిమ్ చేయడంతో పాటు.. చివరికి హెయిర్‌కట్ కూడా చేయాల్సి వస్తుంది. అయితే హెయిర్‌కట్ జరిగిన తర్వాత నువ్వు ఎలాగో అందంగా కనిపిస్తావు అర్జున్. ఇక నా సెలూన్ అసిస్టెంట్ సారా టెండూల్కర్‌కి ప్రత్యేకంగా ధన్యవాదాలు’’ అని సచిన్ క్యాప్షన్ పెట్టారు

 

కాగా.. కొద్ది రోజుల క్రితం సచిన్ తన హెయిర్ తానే కట్ చేసుకున్నారు. టెండూల్కర్ తన కొత్త హెయిర్  కట్ చేసుకుంటున్న ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు మరియు "స్క్వేర్ కట్స్ ఆడటం నుండి నా సొంత హెయిర్ కట్స్ చేయడం వరకు కొత్త పనులు చేయడం ఎప్పుడు నిన్ను ఆనందిస్తాను" అని తెలిపారు.

 అయితే ఇప్పుడు సచిన్ హెయిర్ కట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఆయన అభిమానులను ఈ ఫోటోలు ఇప్పుడు తెగ అలరిస్తున్నాయి. ఇక సచిన్ ఈ కరోనా వైరస్ పై భారత ప్రజలకు సోషల్ మీడియా ద్వారా అవగాహనా కల్పిస్తూనే ఉన్నారు.