Asianet News TeluguAsianet News Telugu

ముంబై జట్టుకు అర్జున్ టెండూల్కర్‌ గుడ్‌బై.. ! గోవా జట్టులో ఆడబోతున్నారా?..

సచిన్ వారసుడిగా క్రికెట్ లోకి అడుగుపెట్టిన అర్జున్ టెండూల్కర్ తన సొంత జట్టు ముంబైకు గుడ్ బై చెప్పనున్నాడు. గోవా జట్టులో ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

Arjun Tendulkar seeks NoC from Mumbai, want to play for Goa next season
Author
Hyderabad, First Published Aug 12, 2022, 8:36 AM IST

ముంబై : టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తన సొంత జుట్టు ముంబైకు గుడ్ బై చెప్పనున్నాడు. దేశవాళీ క్రికెట్ లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ కు అంతగా అవకాశాలు లభించడం లేదు. దీంతో వచ్చే దేశవాలి సీజన్ నుంచి గోవా తరఫున ఆడేందుకు అర్జున్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. కాగా అర్జున్ ఇప్పటివరకు ముంబై తరఫున కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021లో భాగంగా హర్యానా, పుదుచ్చేరి మ్యాచుల్లో అర్జున్ ముంబై జట్టు లో భాగంగా ఉన్నాడు.  

అదేవిధంగా ఐపీఎల్ లో గత రెండు సీజన్ల నుంచి ముంబై జట్టులో అర్జున్ సభ్యునిగా ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్లో కూడా అవకాశం దక్కలేదు. కాగా ఇటీవలే ముగిసిన రంజీ ట్రోఫీలో చోటు దక్కకపోవడంతోనే అర్జున్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే విషయం పై టెండూల్కర్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్  స్పందిస్తూ .. ‘అర్జున్ తన కెరీర్ మెరుగుపరుచుకోవాలంటే ఎక్కువ సమయం గ్రౌండ్లో గడపడం చాలా ముఖ్యం. అర్జున్ గోవా జట్టు తరఫున ఆడితే అతనికి ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. ఈ మార్పు అతడి క్రికెట్ కెరీర్ లో కొత్త దశ’  అని ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ఇదే విషయంపై గోవా క్రికెట్ అసోసియేషన్ కూడా స్పందించింది. 

మీ నాన్నలో సగం ఆడినా నువ్వు గొప్పోడివే.. కానీ.. సచిన్ కొడుకుపై కపిల్ దేవ్ కామెంట్స్

గోవా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సూరజ్ లోట్లికర్ మాట్లాడుతూ … ‘మేము ప్రస్తుతం లెఫ్ట్ ఆర్మ్ పేసర్ల కోసం ఎదురు చూస్తున్నాం. అర్జున్ టెండూల్కర్  గోవా జట్ట లో చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రీ-సీజన్,  రియల్ మ్యాచ్ లు ముందు మేము నిర్వహిస్తాం. అతడి ప్రదర్శన ఆధారంగా సెలెక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు’.. అని ఆయన పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios