కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. కాగా... ఈ లాక్ డౌన్ ఈ ఏడాది జరగాల్సిన క్రీడలు.. విడుదలవ్వాల్సిన సినిమాలు అన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయింది. నిత్యం బిజీ బిజీగా ఉండే క్రికెటర్లు, సినీ తారలు ఇప్పుడు ఖాళీగా ఉంటున్నారు. దీంతో కుటుంబంతో సమయం గడుపుతున్నారు. పలువురు క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తుంటే... సినీ తారలు.. ఏవిధంగా ప్రేక్షకులకు దగ్గరవ్వాలా అని ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఓ వెబ్ సిరీస్ తో మన ముందుకు రాబోతోంది. అదే ‘ పాతాళ లోకం’.

తన ఈ వెబ్ సిరీస్ ని సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేయాలని భావించిన అనుష్క... ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టింది. అయితే.. జనాలు మాత్రం ఆ వెబ్ సిరీస్ సంగతి పక్కన పెట్టి.. మరో విషయంపై ఫోకస్ పెట్టారు. అదే..విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మల పెళ్లి క్యారికేచర్. ఇప్పుడు ఇది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

 

విరుష్కల జంట పెళ్లి బట్టలతో ఉన్నట్లు గీసిన క్యారికేచర్‌ అది. శుక్రవారం అనుష్క శర్మ తన తాజా వెబ్‌ సిరీస్‌ ‘‘పాతాల్‌ లోక్‌’’ను ప్రమోట్‌ చేయటానికి ఇన్‌స్టాగ్రామ్‌లో వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన ఓ ఫొటోను ఆమె షేర్‌ చేశారు. అయితే ఆ ఫొటోలోని విరుష్కల పెళ్లి క్యారికేచర్‌ అభిమానుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. క్యారికేచర్‌పై అభిమానులు స్పందిస్తూ.. ‘‘  ఆ పేయింటింగ్‌ నా మనసు గెలుచుకుంది.. ఫొటోలోని బ్యాక్‌ గ్రౌండ్‌లో ఉన్న పేయింటింగ్‌ కోసం బ్రతుకుతున్నా.. క్యారికేచర్‌ అద్భుతంగా ఉంది ’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా, లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికి పరిమితమైన విరాట్‌ కోహ్లి, అనుష్కల జంట సోషల్‌ మీడియాలో బాగా యాక్టీవ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. తమకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు ఇద్దరు. కరోనాపై పోరుకు విరాళాలు ఇవ్వటమే కాకుండా, లాక్‌డౌన్‌ కారణంగా మహిళలపై పెరుగుతున్న గృహ హింసపై స్పందించి తమ మంచి మనసు చాటుకున్నారు.