తమ వివాహం జరిగిన తర్వాత తొలి ఆరు నెలల్లో 21 రోజులు మాత్రమే కలిసి గడిపామని బాలీవుడ్ హీరోయిన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ వెల్లడించింది. తాజాగా `వోగ్` మేగజీన్ కవర్ పేజీ‌పై మెరిసిన అనుష్క శర్మ తమ వైవాహిక జీవితం గురించి మాట్లాడింది. 

విరాట్‌ తాను పర్యటించిన ప్రతిసారి అది మా ట్రిప్‌ కాదని..కొన్నిసార్లు కలిసి భోజనం మాత్రమే చేసేవాళ్లమని అనుష్క తెలిపారు. ప్రస్తుతం మాత్రం తాము లాక్ డౌన్ కారణంగా ఎక్కువ సేపు సమయం గడిపామని అనుష్క వివరించింది.

 ‘విరాట్‌, నేను కలిసి పర్యటించామంటే అవి సెలవు రోజులు అనుకుంటారంతా. కానీ అది నిజం కాదు. ఎందుకంటే విరాట్‌ ఎప్పుడు బిజీగా ఉంటాడు. కొన్నిసార్లు మా ట్రిప్‌ అంటే కలిసి భోజనం చేయడం మాత్రమే. నిజానికి మా వివాహమైన మొదటి 6 నెలల్లో విరాట్‌ నేను 21 రోజులే కలిసి ఉన్నాం. కొన్నిసార్లు కలిసి భోజనం చేసేందుకే విదేశాల్లో కలుసుకునే వాళ్లం’ అంటూ చెప్పుకొచ్చారు. 

విరాట్‌ కోహ్లి  మాట్లాడుతూ.. ‘నేను అనుష్కను కలిసినప్పుడల్లా మా బంధం ఎప్పటిదో అనిపిస్తుంది. మేము ప్రతిరోజూ ఒకరినొకరు ప్రేమిస్తూ జీవిస్తాం. మా సంబంధం ఎల్లప్పుడూ ప్రేమతో మాత్రమే నిండి ఉంటుంది. ఇది కొన్నిరోజుల క్రితం కాదు యుగయుగాలుగా నుంచి ఉందన్న భావన కలుగుతుంది’’ అని చెప్పాడు. కోహ్లి, అనుష్కల వివాహం 2017 డిసెంబర్‌ 11న ఇటలీలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు కొద్దిమంది బాలీవుడ్‌, క్రికెట్‌ ప్రముఖుల సమక్షంలో జరిగిన విషయం తెలిసిందే.