కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్ లో జరిగిన పింక్ టెస్టు సిరీస్ ని భారత్ కైవసం చేసుకుంది. బంగ్లా దేశ్ ని చిత్తుగా ఓడించి కోహ్లీ సేన విజయ ఢంకా మోగించింది. కోల్ కతా నగరంలో తొలిసారిగా టీమిండియా డే అండ్ నైట్ పింక్ టెస్టు ఆడాయి. టెస్టు సిరీస్ ని కైవసం చేసుకున్న అనంతరం టీమిండియా ముంబయికి చేరుకుంది.

కాగా... ముంబయికి చేరుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆయన భార్య, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ.... ఘన స్వాగతం పలికారు. విరాట్ ఎయిర్ పోర్టులో దిగడానికి ముందే అనుష్క శర్మ అక్కడికి చేరుకున్నారు. కోహ్లీకి చిరునవ్వుతో అనుష్క స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. బ్యూటిఫుల్ కపుల్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా... ఇటీవల కోహ్లీకి పుట్టిన రోజుకి విరాట్, అనుష్క దంపతులు భూటాన్ పర్యటను వెళ్లారు. ఆ సమయంలో టీమిండియా బంగ్లాదేశ్ తో టీ20 మ్యాచ్ కోసం తలపడుతుండగా....ఆ సిరీస్ లో కోహ్లీకి విశ్రాంతి ఇచ్చారు. దీంతో ఈ బ్యూటిఫుల కపుల్ భూటాన్ పర్యటనకు వెళ్లి ఎంజాయ్ చేశారు. ఆ ఫోటోలను అనుష్క తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదిలా ఉండగా... ఈ జంట తమ వృత్తి పరంగా ఎంత  బిజీగా ఉన్నా... తమ పర్సనల్ లైఫ్ కి సమయం కేటాయిస్తూనే ఉంటారు.