Asianet News TeluguAsianet News Telugu

దేవుడు ఉత్తమ స్క్రిప్ట్ రైటర్.. అతడి బిడ్డవే నువ్వు.. : కోహ్లీ పై అనుష్క భావోద్వేగభరిత కామెంట్స్

తన భర్త విరాట్ కోహ్లీ  50వ సెంచరీ రికార్డ్ పై భావోద్వేగభరితంగా కామెంట్స్ చేసింది బాలీవుడ్ భామ అనుష్క శర్మ. 

Anushka Sharma emotional words about his husband Virat Kohli AKP
Author
First Published Nov 17, 2023, 10:22 AM IST

ముంబై : విరాట్ కోహ్లీ... భారతీయులకే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ను ఇష్టపడేవారికి పరిచయం అక్కర్లేని పేరు. వన్డే, టీ20, టెస్ట్... ఫార్మాట్ ఏదైనా... స్వదేశం, విదేశం ఎక్కడ ఆడినా... ప్రత్యర్ధి జట్టు ఎంత బలమైనదైనా... బౌలర్లు ఎంతటి గొప్పవారైనా కోహ్లీకి అనవసరం... అతడికి తెలిసిందల్లా బ్యాటు పట్టడం... పరుగుల వరద పారించడం. అతడి పరుగుల దాహానికి అసలు ఎవ్వరికీ సాధ్యం కాదనుకున్న సచిన్ 49 సెంచరీల రికార్డ్ కూడా బద్దలయ్యింది.  కోహ్లీ ఆటముందు క్రికెట్ గాడ్ రికార్డ్ సైతం చిన్నబోయింది. ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ పై మరోసారి వందపరుగు చేసిన కోహ్లీ 50 సెంచరీల మైలురాయికి చేరుకున్నాడు. 

తన భర్త విరాట్ కోహ్లీ హాప్ సెంచరీ సెంచరీల రికార్డును కళ్లారా చూసిన అనుష్క శర్మ మైదానంలోనే ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికన భర్త సాధించిన అద్భుత రికార్డుపై అనుష్క శర్మ ఆసక్తికర కామెంట్స్ చేసారు. 

''దేవుడు మంచి స్క్రిప్ట్ రైటర్! ఇంతటి గొప్పవ్యక్తి ప్రేమను అందించిన ఆ భగవంతుడికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు. నీ (విరాట్ కోహ్లీ) సత్తాతోనే ఇక్కడివరకు వచ్చావని  ఎదుగుదలను చూసుకుంటూ వస్తున్న నాకు అనిపిస్తోంది. నువ్వు ఇలాగే ఆటపై అంకితభావంతో, నిజాయితీతో వుండాలి. నువ్వు నిజంగా దేవుడి బిడ్డవు'' అంటూ అనుష్క ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టింది. కోహ్లీ 50వ సెంచరీ సాధించగానే దేవుడికి దండం పెట్టుకుంటున్న ఫోటోను జతచేసి భావోద్వేగంతో కూడిన స్టోరీ పెట్టింది అనుష్క శర్మ. 

Anushka Sharma emotional words about his husband Virat Kohli AKP

ఇదిలావుంటే భారతదేశం ఆతిథ్యమిస్తున్న ఐసిపి ప్రపంచ కప్ 2023 ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే సెమీపైనల్స్ మ్యాచుల్లో ఇండియా, ఆస్ట్రేలియా జట్లు విజయం సాధించి ఫైనల్ కు చేరాయి. ఆదివారం అహ్మదాబాద్ లో భారత్, ఆసిస్ మధ్య ఫైనల్ సమరం జరగనుంది. ఈ వరల్డ్ కప్ మెగా టోర్నీలో ఇప్పటిరకు ఓటమన్నదే ఎరగకుండా దూసుకుపోతున్న రోహిత్ సేన మరో విజయంతో ముగింపు పలకాలని చూస్తోంది. స్వదేశంలో... సొంత అభిమానుల మధ్య విశ్వవిజేతగా నిలిచేందుకు టీమిండియా సంసిద్దమయ్యింది. 

Follow Us:
Download App:
  • android
  • ios