మ్యాచ్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన ఆమె  ఇది కదా విజయం అంటే.. ఇది కదా టీమ్ అంటే అంటూ పేర్కొన్నారు. ఇన్ స్టాగ్రామ్  స్టోరీస్ లో.. ఈ ఫోటోలను అనుష్క శర్మ షేర్ చేయడం విశేషం.

లార్డ్స్ లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ విజయం పట్ల సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. సోమవారం జరిగిన మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. 151 పరుగుల తేడాతో ఈ విజయం సాధించడం విశేషం. కాగా.. దీనిపై తాజాగా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ కూడా స్పందించారు.

టీమిండియా విజయంపై ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. మ్యాచ్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన ఆమె ఇది కదా విజయం అంటే.. ఇది కదా టీమ్ అంటే అంటూ పేర్కొన్నారు. ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో.. ఈ ఫోటోలను అనుష్క శర్మ షేర్ చేయడం విశేషం.

ఈ టెస్ట్ సిరీస్ కోసం అనుష్కశర్మ.. తన కూతురు వామికాతో కలిసి విరాట్ తో సహా.. యూకే వెళ్లింది. వీరు ఇప్పటికే చాలా సార్లు.. లండన్ లో వారు దిగిన ఫోటోలను షేర్ చేశారు. కొద్ది రోజుల క్రితం.. అనుష్క, కోహ్లీ లు తమ ఆరు నెలల కుమార్తె వామికతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు. ఆ ఫోటోల్లో వామిక ఫేస్ కనపడకుండా జాగ్రత్త పడ్డారు.

ఆ ఫోటోలకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ అందరినీ ఆకట్టుకుంది. ‘ ఆమె నవ్వు.. మా ప్రపంచం మొత్తం నువ్వు మార్చేశావు. నువ్వు మాపై చూపించే ప్రేమతో మేము జీవితాంతం సంతోషంగా ఉండగమని ఆశిస్తున్నాను. ఆరో నెల శుభాకాంక్షలు’ అంటూ తమ చిన్నారి ఫోటోలకు అనుష్క క్యాప్షన్ ఇచ్చారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అనుష్క ఎలాంటి సినిమాలు చేయడం లేదు. పాప పుట్టిన దగ్గర నుంచి ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. త్వరలో ఆమె మళ్లీ షూటింగ్ లో అడుగుపెట్టే అవకాశం ఉంది.