Asianet News TeluguAsianet News Telugu

లైన్ దాటకపోయినా నాటౌట్‌గా ప్రకటన... మరోసారి అంపైర్ షాకింగ్ నిర్ణయం...

రెండో వన్డేలో వికెట్ తీయలేకపోతున్న భారత బౌలర్లు...

కుల్దీప్ యాదవ్ డైరెక్ట్ త్రోకి బెన్ స్టోక్స్ అవుటైనా నాటౌట్‌గా ప్రకటించిన థర్డ్ అంపైర్...

థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని ఆశ్చర్యం వ్యక్తం చేసిన యువరాజ్ సింగ్, మైఖేల్ వాగన్...

Another Controversial decision from Third umpire, Ben Stokes survives CRA
Author
India, First Published Mar 26, 2021, 8:30 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్లు ఒక్క వికెట్ కోసం నానా కష్టాలు పడుతున్నారు. గత మ్యాచ్‌లో దూకుడుగా ఆరంభించి, ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయి ఓటమిపాలైన ఇంగ్లాండ్, ఈ మ్యాచ్‌లో చాలా తెలివిగా నిలకడగా ఆడుతూ లక్ష్యంవైపు సాగుతోంది.

అయితే 32 ఓవర్లు ముగిసినా భారత బౌలర్లు ఎవ్వరూ వికెట్ తీయలేకపోయారు. థర్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయాలు కూడా భారత జట్టుకు కలిసి రావడం లేదు. 26వ ఓవర్‌లో భువీ బౌలింగ్‌లో రెండో రన్ కోసం ప్రయత్నించాడు బెన్ స్టోక్స్. అయితే కుల్దీప్ యాదవ్ డైరెక్ట్ హిట్ కొట్టడంతో థర్డ్ అంపైర్‌కి నిర్ణయాన్ని అప్పీలు చేశారు అంపైర్లు.

ఎప్పటిలాగే చాలాసేపు రిప్లై చేసిన థర్డ్ అంపైర్, బంతి వికెట్లను తాకినప్పుడు బ్యాటు లైన్ దాటకపోయినా నాటౌట్‌గా ప్రకటించాడు. భారత జట్టుకు వ్యతిరేకంగా వచ్చిన ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో పాటు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాగన్ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తంచేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios