కరోనా పోరుకు టెస్టు మ్యాచులోని రెండో ఇన్నింగ్స్ కు సూపర్ పోలిక చెప్పిన కుంబ్లే
అత్యంత కష్టంగా సాగుతున్న కోవిడ్-19పై పోరాటాన్ని రసవత్తర టెస్టు మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌తో పోల్చారు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే. రూపాంతరం చెందుతూ, ఖండాంతరాలను చెరిపేస్తూ రోజురోజుకూ పెను ప్రమాదకారిగా మారుతున్న కరోనా వైరస్ బారిన ఇప్పటికే 40 లక్షలకు మందికిపైగా పడ్డారు.

కోవిడ్-19 మరణాల సంఖ్య మూడు లక్షలకు చేరువగా వస్తోంది. భారత్‌లో సైతం కరోనా వైరస్ బాధితుల సంఖ్య 60 వేల మార్క్ దాటడం ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రీడా కార్యకలాపాలు నిలిచిపోగా.. ఒలింపిక్స్, ఐపీఎల్, సాకర్ లీగ్‌లు, యూరోకప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలు వాయిదా పడ్డాయి.
ప్రమాదకర కోవిడ్-19పై పోరులో ముందస్తు ఆత్మసంతృప్తి చెందకూడదని, సుదీర్ఘ పోరాటంలో క్రమశిక్షణతో ముందుకు సాగాలని కుంబ్లే పిలుపునిచ్చారు. ' కరోనా వైరస్‌పై మనం యుద్ధం చేయాలంటే, ఈ సమయంలో అందరం కలిసికట్టుగా ఉండాలి. ఇది టెస్టు మ్యాచ్ వంటిదే.
టెస్టు మ్యాచు ఐదు రోజులు ఉంటుంది. కరోనా వైరస్ దుస్థితి ఎక్కువ రోజులు ఉంటోంది. క్రికెట్ టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు ఉంటాయి. కరోనా టెస్టులో పలు ఇన్నింగ్స్‌లు ఉంటున్నాయి.
తొలి ఇన్నింగ్స్‌లో లభించిన స్వల్ప ఆధిక్యంతోనే ఆత్మ సంతృప్తి చెందకూడదు. రెండో ఇన్నింగ్స్‌లో కఠినమైన గడ్డు పరిస్థితులను ఎదుర్కొవాల్సి ఉంది. కరోనా టెస్టులో విజయానికి కేవలం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సరిపోదు.
కరోనా వైరస్‌ను పూర్తిగా నాకౌట్ చేసి, భారీ విజయం సాధించాలి. కరోనా వైరస్‌పై పోరాటంలో ముందుండి నడిపిస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్ వైద్యులు, నర్సులు, అటెండర్లు, పారిశుద్ద్య కార్మికులు, వాలంటీర్లు, ప్రభుత్వ సిబ్బంది, అధికారులు, పోలీసులు అందరికీ కృతజజ్ఞతలు తెలుపుతున్నాను. మీ అందరూ గొప్పగా విధి నిర్వహణ చేస్తున్నారు' అని అనిల్ కుంబ్లే ట్విటర్ వీడియో ఉంచారు.