మరో మూడు రోజుల్లో టీమిండియా, శ్రీలంక జట్లు టీ20 సిరీస్ కోసం తలపడనున్నాయి. భారత్ వేదికగా ఈ సీరిస్  జరగనుంది. కాగా... ఈ మ్యాచ్ నేపథ్యంలో శ్రీలంక జట్టులోకి ఆల్ రౌండర్ ఎంజ్ లో మాథ్యూస్ జట్టులోకి వచ్చాడు. దాదాపు 16నెలల విరామం తర్వాత మాథ్యూస్ జట్టులోకి అడుగుపెట్టడం విశేషం.

భారత్‌తో ఈనెల 5న మొదలయ్యే మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే శ్రీలంక జట్టును బుధవారం ప్రకటించారు. 16 మంది సభ్యులుగల జట్టుకు లసిత్‌ మలింగ సారథ్యం వహిస్తాడు. 32 ఏళ్ల మాథ్యూస్‌ 2018 ఆగస్టులో చివరిసారి టి20 మ్యాచ్‌ ఆడాడు.  

శ్రీలంక టి20 జట్టు: మలింగ (కెప్టెన్‌), గుణతిలక, అవిష్క ఫెర్నాండో, ఎంజెలో మాథ్యూస్, దసున్‌ షనక, కుశాల్‌ పెరీరా,    డిక్‌వెల్లా, ధనంజయ డిసిల్వా, ఇసురు ఉడాన, భానుక రాజపక్స, ఒషాడా ఫెర్నాండో, వనిందు హసరంగ, లాహిరు కుమార, కుశాల్‌ మెండిస్, సందకన్, కసున్‌ రజిత.