ప్రముఖ క్రికెటర్ ఆండ్రీ రసెల్ ఈ రోజు తన 32వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ స్పెషల్ సర్ ప్రైజ్ ఇఛ్చింది. ఈ సర్ ప్రైజ్ రసెల్ తో పాటు అతని అభిమానులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది.

రసెల్.. ఐపీఎల్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ తరపున  ఆడుతాడన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రసెల్ పుట్టిన రోజు పురస్కరించుకొని అతనికి సంబంధించిన త్రోబ్యాక్ వీడియో ని కేకేఆర్ టీమ్ షేర్ చేసింది.

ఆ వీడియోలో రసెల్.. హిందీ పాట పాడటం గమనార్హం.  దేశీ బాయ్స్ సినిమాలోని శుభ హోనే నా దే పాటను రసెల్ అద్భుతంగా పాడాడు. ఈ వీడియోని ట్విట్టర్ లో షేర్ చేసి.. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది.

దీనికి .. కోల్ కతా నైట్ రైడర్స్, హ్యాపీ బర్త్ డే ఆండ్రీ, డేసీ బాయ్స్ వంటి ట్యాగ్స్ ఇఛ్చింది. ఈ వీడియో ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇదిలా ఉండగా.. కరోనా లాక్ డౌన్ కారణంగా క్రీడా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ఐపీఎల్ 13 కూడా వాయిదా పడింది. దీంతో క్రికెటర్లంతా ఇంట్లో నే టైంపాస్ చేస్తున్నారు.