డిసెంబర్ 3న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3నే పోలింగ్ నిర్వహించి, అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు సహా కీలక పదవులకు ఆశావహులు పోటీపడనున్నారు.
దేశంలోని ప్రతిష్టాత్మక క్రికెట్ సంఘాల్లో ఒకటైన ఆంధ్రా క్రికెట్ సంఘం (ఏసీఏ) ఎన్నికలకు నగారా మోగింది. ఈ నేఫథ్యంలో డిసెంబర్ 3న ఎన్నికలు నిర్వహించనున్నారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, అపెక్స్ కౌన్సిల్, ఓ కౌన్సిలర్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3నే పోలింగ్ నిర్వహించి, అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నారు. ఇకపోతే.. గత కొంతకాలంగా ఏసీఏ అద్భుతంగా పనిచేస్తోంది. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు క్రికెట్ అభివృద్ధికి శ్రమిస్తోంది. ఏసీఏకే చెందిన ఎమ్మెస్కే ప్రసాద్ చీఫ్ సెలక్టర్‌గా పనిచేయడంతో పాటు హనుమ విహారి, శ్రీకర్ భరత్ వంటి ఆటగాళ్లు జాతీయ జట్టులో స్థానం సంపాదించారు.
