Asianet News TeluguAsianet News Telugu

ఆసియా కప్ శ్రీలంక గెలవడానికి కారణం ఇదేనన్న ఆనంద్ మహీంద్రా...!

టీమ్ వర్క్ ఉంటే ఎంత చిన్న జట్టు అయినా అద్భుతాలు సృష్టించగలదని ఆయన పేర్కొన్నారు. కాగా.. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు నెటిజన్లను సైతం ఆకట్టుకుంటోంది. శ్రీలంక సక్సెస్ సీక్రెట్ ని  ఆయన ఒక్క మాటలో చెప్పారంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.

Anand mahindra says Team work is the reason for Sri Lanka Victory
Author
First Published Sep 13, 2022, 10:29 AM IST

ఆసియాకప్ 2022 ని శ్రీలంక గెలుచుకుంది. నిజానికి ఈ కప్ ని  శ్రీలంక గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. స్టార్ క్రికెటర్లు ఎవరూ లేకుండా బరిలోకి దిగిన శ్రీలంకకు గెలుపు సాధ్యమౌతుందని ఎవరూ అనుకోలేదు. కనీసం ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి అడుగుపెట్టింది..  చివరకు కప్ గెలుచుకుంది. అయితే... శ్రీలంక ట్రోఫీ గెలవడానికి కారణాన్ని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా వివరించారు. టీమ్ వర్క్ ఉంటే... స్టార్ క్రికెటర్లు కూడా అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఫైనల్స్ లో జరిగిన శ్రీలంక, పాకిస్తాన్ మ్యాచ్ పై ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ ని శ్రీలంక ఓడించిన తీరు చాలా అద్భుతంగా , థ్రిల్లింగ్ అనిపించిందని ఆయన పేర్కొన్నారు. క్రికెట్ లాంటి గేమ్ లో టీమ్ వర్క్ ఉంటే... సెలబ్రెటీలు, సూపర్ స్టార్లు అవసరం లేదని.. శ్రీలంక జట్టు నిరూపించిందని ఆయన పేర్కొన్నారు. టీమ్ వర్క్ ఉంటే ఎంత చిన్న జట్టు అయినా అద్భుతాలు సృష్టించగలదని ఆయన పేర్కొన్నారు. కాగా.. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు నెటిజన్లను సైతం ఆకట్టుకుంటోంది. శ్రీలంక సక్సెస్ సీక్రెట్ ని  ఆయన ఒక్క మాటలో చెప్పారంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.

 

కాగా.. దుబాయి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్-శ్రీలంక  ఫైనల్  లో లంక.. పాకిస్తాన్ పై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. పాక్ ముందు 171 పరుగుల లక్ష్యాన్ని  నిలిపింది. లక్ష్య ఛేదనలో పాకిస్తాన్.. 20 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయింది లంక యువ పేపర్ ప్రమోద్ మదుషాన్ 4 వికెట్లతో చెలరేగగా..స్పిన్నర్ వనిందు హసరంగ  3 వికెట్లతో పాకిస్తాన్ నడ్డి విరిచాడు. ఈ విజయంతో  శ్రీలంక.. ఆరో ఆసియా కప్ గెలుచుకుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios