ఆయన మృతి క్రికెట్ అభిమానుల్లో విషాదం నింపింది. ఇదిలా ఉండగా.. ఆయన మృతికి ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ ఇండియా వినూత్నంగా సంతాపం తెలియజేసింది.

ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం ఆండ్రూ సైమండ్స్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల క్రితం టౌన్స్‌విల్లే సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో 46 ఏళ్ల సైమండ్స్‌ మరణించాడు. 1998లో ఆస్ట్రేలియా తరపున వన్డే ఇంటర్నేషనల్‌లో అరంగేట్రం చేసిన సైమండ్స్‌.. దిగ్గజ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు. కాగా.. ఆయన మృతి అందరినీ కలచివేసింది.

ఆయన ఆత్మకు శాంతి చేకూరలను ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. కాగా.. ఆయన మృతి క్రికెట్ అభిమానుల్లో విషాదం నింపింది. ఇదిలా ఉండగా.. ఆయన మృతికి ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ ఇండియా వినూత్నంగా సంతాపం తెలియజేసింది.

ఆయనకు నివాళులర్పిస్తూ.. స్పెషల్ గా ఓ డూడుల్ డిజైన్ చేసింది. ఆ డూడుల్ తో.. అమూల్.. ఆయనకు నివాళులర్పించడం గమనార్హం. ఆ డూడుల్ కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకోవడం విశేషం. ఆయన ఫోటోలతోనే ఈ డూడుల్ డిజైన్ చేశారు. 

View post on Instagram


ఇదిలా ఉండగా.. 198 వన్డేలు ఆడిన సైమండ్స్‌.. 2003, 2007 వరల్డ్‌ కప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే సైమండ్స్‌ మృతి పట్ల ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు, ఐసీసీ, ఆసీస్‌ మాజీ ఆటగాళ్లు ఆడమ్‌ గ్రిల్‌కిస్ట్‌, గిల్లెస్పీ, న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ ఫ్లెమింగ్‌, పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌, భారత మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ట్విటర్ ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు.