#SA20: సన్‌రైజర్స్‌దే టైటిల్... ఫైనల్‌లో క్యాపిటల్స్‌పై ఘన విజయం...
#SA20 ఫైనల్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచిన సన్‌రైజర్స్ ఈస్టరన్ కేప్... సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా అయిడిన్ మార్క్‌రమ్ కన్ఫార్ట్!
సౌతాఫ్రికా20 లీగ్ సీజన్ 1 ముగిసింది.. మొట్టమొదటి సీజన్ టైటిల్‌ని సన్‌రైజర్స్ ఈస్టరన్ కేప్ సొంతం చేసుకుంది. సెమీ ఫైనల్‌లో టేబుల్ టాపర్ జోహన్‌బర్గ్ సూపర్ కింగ్స్‌ని ఓడించి షాక్ ఇచ్చిన సన్‌రైజర్స్, ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలిచి, మొట్టమొదటి టైటిల్‌ని కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ఈస్టరన్ కేప్ టీమ్ కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్, ఫీల్డింగ్ ఎంచుకున్నాడు..
తొలుత బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్, 19.3 ఓవర్లలో 135 పరుగులకి ఆలౌట్ అయ్యింది. దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన ప్రిటోరియా, 3.5 ఓవర్లలో 33 పరుగులు చేసింది. 19 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసిన కుశాల్ మెండిస్‌ని ఓట్‌నియల్ బార్త్‌మన్ అవుట్ చేశాడు. 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన సాల్ట్, వాన్ దేర్ మెర్వీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
తెనిస్ డే బ్రున్ 11, రిసో 19, ఇంగ్రామ్ 17, జేమ్స్ నీశమ్ 19, ఈథన్ బోస్క్ 15 పరుగులు చేయగా కెప్టెన్ వార్న్ పార్నెల్ 8 పరుగులు చేశాడు. మిగల్ ప్రిటోరియస్ డకౌట్ కాగా అదిల్ రషీద్ 3, అన్రీచ్ నోకియా 5 పరుగులు చేశారు..
సన్‌రైజర్స్ బౌలర్లలో వార్ దేర్ మెర్వీ 4 వికెట్లు తీయగా మగలా, బార్త్‌మన్ రెండేసి వికెట్లు తీశారు. అయిడిన్ మార్క్‌రమ్, మార్కో జాన్సెన్ తలా ఓ వికెట్ తీశారు...
136 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన సన్‌రైజర్స్ ఈస్టరన్ కేప్‌కి శుభారంభం దక్కలేదు. తెంబ భవుమా 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రెండో వికెట్‌కి జోర్డాన్ హర్మాన్, ఆడమ్ రస్సింగ్టన్ కలిసి 67 పరుగుల భాగస్వామ్యం జోడించారు...
17 బంతుల్లో 5 ఫోర్లతో 22 పరుగులు చేసిన జోర్డాన్‌ని అదిల్ రషీద్ స్టంపౌట్ చేశాడు. 19 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసిన కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్, ఇంగ్రామ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 30 బంతుల్లో 4 ఫోర్లు,5 సిక్సర్లతో 57 పరుగులు చేసిన ఆడమ్ రస్సింగ్టన్‌ని నోకియా అవుట్ చేశాడు. జోర్డాన్ కాక్స్ 7, ట్రిస్టన్ స్టబ్స్ 5 పరుగులు చేసి అవుట్ కాగా మార్కో జాన్సెన్ 11 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 13 పరుగులు చేసి సన్‌రైజర్స్‌కి విజయాన్ని అందించాడు...
కెప్టెన్‌గా అండర్19 వరల్డ్ కప్ గెలిచిన అయిడిన్ మార్క్‌రమ్, సౌతాఫ్రికా20 లీగ్‌ని సొంతం చేసుకున్నాడు. ఈ విజయంతో 2023 ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి అయిడిన్ మార్క్‌రమ్ కెప్టెన్సీ చేయడం ఖాయమైపోయినట్టే...
2023, జనవరి 10న సౌతాఫ్రికా20 లీగ్ ప్రారంభమైంది. జనవరి 24 తర్వాత వర్షాల కారణంగా లీగ్‌కి 12 రోజుల పాటు బ్రేక్ ఇచ్చారు. ఫిబ్రవరి 2న తిరిగి ప్రారంభమైన లీగ్, ఎట్టకేలకు 12న ముగిసింది. లీగ్‌లో 340 పరుగులు, 11 వికెట్లు తీసిన అయిడిన్ మార్క్‌రమ్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలిచాడు.