Lowest T20 Totals in Cricket History: టీ20తో పాటు క్రికెట్ చరిత్రలో అత్యంత  తక్కువ స్కోరు నమోదుచేసిన సిడ్నీ థండర్స్ కు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్యాన్స్  కృతజ్ఞతలు చెబుతున్నారు. 

బిగ్ బాష్ లీగ్ లో భాగంగా శుక్రవారం సిడ్నీ థండర్స్ - అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో సిడ్నీ జట్టు అత్యంత చెత్త ఆటతో 15 పరుగులకే ఆలౌటైంది. క్రికెట్ చరిత్రలో మరీ ముఖ్యంగా టీ20లలో ఇంత తక్కువకు ఆలౌట్ అయిన జట్టుగా చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకుంది. అయితే సిడ్నీ థండర్స్ ఆటపై ఆ ఫ్రాంచైజీ, ఆస్ట్రేలియా అభిమానులు ఎలా స్పందిస్తున్నారో తెలియదు గానీ ఐపీఎల్ లో ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం సంబురాలు చేసుకుంటున్నారు. సిడ్నీ థండర్స్ కు కృతజ్ఞతలు చెబుతున్నారు. 

అదేంటి..? మరీ 15 పరుగులకు ఆలౌటైతే ఇక్కడ ఆర్సీబీ ఫ్యాన్స్ సంబురాలు చేసుకోవడానికి గల కారణామేంటి..? మరీ ఆర్సీబీ ఫ్యాన్స్‌కు అంత రాక్షసానందం ఏముంది..? అత్యంత తక్కువ స్కోరు చేసిన జట్టుకు ఓదార్చి మద్దతివ్వాల్సింది పోయి సంబురాలు చేసుకోవడం, కృతజ్ఞతలు చెప్పుకోవడం దేనికి..? అనేగా మీ డౌటానుమానం.. కానీ ఆర్సీబీ ఫ్యాన్స్ సంబురాలకు బలమైన కారణముంది. 

ఐపీఎల్ చరిత్రలో అత్యంత తక్కువ స్కోరు నమోదు చేసిన జట్టుగా ఆర్సీబీకి ఓ చెత్త రికార్డు ఉంది. 2017 సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో భాగంగా ఆర్సీబీ 49 పరుగులకే ఆలౌట్ అయింది. ఐపీఎల్ లో ఇప్పటివరకూ ఒక్క ట్రోఫీ కూడా నెగ్గని జట్లలో ఆర్సీబీ ఒకటి. ఇప్పటికీ ఆ జట్టు అభిమానులు పది పరుగుల లోపు రెండు మూడు వికెట్లు పడితే.. ‘వామ్మో మళ్లీ ఆ చెత్త రికార్డు రిపీట్ అవుద్దా..?’ అని ఆందోళన చెందుతారు. అయితే ఇప్పుడు వారికి ఆ దిగులు లేదు. ఫ్రాంచైజీ క్రికెట్ లో తమ కంటే ఇప్పుడు సిడ్నీ థండర్స్ అత్యంత చెత్త ప్రదర్శన చేసింది.

సిడ్నీ థండర్స్ 15 పరుగులకే ఆలౌట్ కావడంతో ఆర్సీబీ ట్విటర్ లో ట్రెండింగ్ లోకి రావడం విశేషం. పలువురు నెటిజనులు ఇందుకు సంబంధించిన మీమ్స్, ట్రోల్స్ తో నవ్వులు పూయించారు. ‘హమ్మయ్యా.. ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ హ్యాపీగా పడుకోవచ్చు..’ అని కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. 

Scroll to load tweet…

Scroll to load tweet…

పురుషుల టీ20లో అత్యల్ప స్కోర్లు: 

- సిడ్నీ థండర్స్ - 15 పరుగులకే ఆలౌట్ 
- టర్కీ - 21 ఆలౌట్ (చెక్ రిపబ్లిక్ పై) 
- లెసొతొ - 26 ఆలౌట్ (ఉగాండాపై) 
- టర్కీ - 28 ఆలౌట్ (లగ్జంబర్గ్ పై) 
- థాయ్లాండ్ - 30 ఆలౌట్ (మలేషియాపై) 

*ఐపీఎల్ లో అత్యల్ప స్కోరు నమోదుచేసిన జట్టు ఆర్సీబీ (49). ఆ తర్వాత జాబితాలో రాజస్తాన్ రాయల్స్ (58), ఢిల్లీ డేర్ డెవిల్స్ (66), ఢిల్లీ (67), కేకేఆర్ (67), ఆర్సీబీ (70) పేరిట ఉన్నాయి.

Scroll to load tweet…

Scroll to load tweet…