Asianet News TeluguAsianet News Telugu

ఆసియా కప్: తేల్చేసిన భారత్, చేతులెత్తేసిన పాకిస్తాన్

ఆసియా కప్ పాకిస్తాన్ లో జరిగే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. భారత్ పాల్గొనకపోతే తాము ఆసియా కప్ నిర్వహణ హక్కులను వదిలేసుకుంటామని పీసీబీ చీఫ్ ఇషషాన్ మణి చెప్పారు.

After BCCI's refusal to send Team India, PCB chief hints at Pakistan giving up hosting rights for Asia Cup
Author
Karachi, First Published Feb 20, 2020, 12:17 PM IST

కరాచీ: ఆసియా కప్ హక్కులను వదిలేసుకోవడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సిద్దపడింది. భారత జట్టు పాల్గొనడానికి సిద్ధంగా లేకపోవడంతో టోర్నీ నిర్వహించే హక్కులనే వదులుకునేందుకు వెనకాడబోమని పపీసీపీ చైరమ్న్ ఇహసాన్ మణి చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆసియా కప్ జరగాల్సి ఉంది. దాని హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది. 

ఈ క్రమంలో పాకిస్తాన్ కు తమ జట్టును పంపే ప్రసక్తి లేదని ఇండియా స్పష్టం చేసింది. అయినప్పటికీ భారత్ నిర్ణయం కోసం వేచి చూస్తామని ఇంతకు ముందు పీసీబీ చెప్పినప్పటికీ ఇప్పుడు ఏకంగా చేతులెత్తేసినట్లు అర్థమవుతోంది. భారత క్రికెట్ జట్టు ఆసియా కప్ లో ఆడకపోతే తాము నిర్వహణ హక్కులను వదులుకుంటామని మణి చెప్పారు. 

దానిపై మార్చిలో జరిగే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మణి వ్యాఖ్యల నేపథ్యంలో టోర్నీని ఎక్కడ నిర్వహించాలనే విషయంపై చర్చించనున్నారు. 

అసోసియేట్ సభ్యుల ఆదాయాలు ప్రభావితం కాకుడా చూసుకోవాలని, ఇది ఐసీసీ పూర్తి సభ్యత్వం ఉ్న దేశాల గురించి కాదని, ఇక్కడ అసోసేయేట్ సభ్యత్వం కలిగిన దేశాల గురించి కూడా ఆలోచించాలని, అవసరమైతే తాము ఆసియా హక్కులను కూడా వదులుకోవడానికి సిద్దంగా ఉన్నామని మణి అన్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) తాజా సీజన్  ట్రోఫీని అవిష్కరించి ఆయన మాట్లాడుతూ ఆ విషయాలు చెప్పారు. 

ఆసియా కప్ లో భారత్ అడితే అది పాకిస్తాన్ వేదిక మీద జరగదని బీసీసీఐ అధికారి ఒకరు అన్నారు. భారత్ లేకుండా పాక్ లో ఆసియా కప్ జరిగితే అది భిన్నంగా ఉంటుందని, ఒక వేళ భారత్ ఆడాలనుకుంటే మాత్రం వేదికలు పాకిస్తాన్ లో ఉండవని ఆయన అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios