Asianet News TeluguAsianet News Telugu

ఆసియాకప్ 2022: శ్రీలంకపై పాక్ ఓటమి...ఆప్ఘాన్ అభిమానుల సంబరాలు..!

శ్రీలంక గెలవగానే.. ఆప్ఘనిస్తాన్ లో అభిమానులు ఆనందంతో రెచ్చిపోయారు. వాళ్లే గెలిచినంత ఎక్కువగా సంబరాలు చేసుకోవడం గమనార్హం. 

Afghanistan fans Celebrate Sri Lanka Title win
Author
First Published Sep 12, 2022, 9:53 AM IST

ఆసియాకప్ 2022 సమరం ముగిసింది. ఈ సమరంలో.. అన్ని జట్లు పోటాపోటీగా తలపడగా చివరకు శ్రీలంక ట్రోఫీ గెలిచింది. కాగా... శ్రీలంక కప్పు గెలవడం.. ఆ దేశస్తుల సంగతేమో కానీ... ఆప్ఘానిస్తాన్ ప్రజలు మాత్రం సంబరాలు చేసుకోవడం గమనార్హం. వారి ఆనందం శ్రీలంక గెలిచినదానికన్నా... పాకిస్తాన్ ఓడిపోవడం గమనార్హం.

ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్సే అదరగొట్టాడు. అద్భుతమైన హాఫ్ సెంచరీతో.. జట్టు విజయానికి సహకరించాడు. శ్రీలంక గెలవగానే.. ఆప్ఘనిస్తాన్ లో అభిమానులు ఆనందంతో రెచ్చిపోయారు. వాళ్లే గెలిచినంత ఎక్కువగా సంబరాలు చేసుకోవడం గమనార్హం. రాజపర్సే, పేసర్ మదుషన్ ల అద్భుతమైన ప్రదర్శనతో కేవలం 24 పరుగుల తేడాతో శ్రీలంక ట్రోఫీ ని ఎగరేసుకుపోయింది. కాగా.. కప్ గెలవాలన్న పాకిస్తాన్ ఆశలు నీరుగారిపోయాయి.

ఆఫ్ఘనిస్తాన్ జర్నలిస్ట్ అబ్దుల్‌హాక్ ఒమెరీ షేర్ చేసిన వీడియోలో, శ్రీలంక గెలిచిన తర్వాత కొంతమంది ఆనందోత్సాహాలతో, కొంతమంది ఆనందంతో డ్యాన్స్ చేస్తూ, వీధిలో పెద్ద సంఖ్యలో ప్రజలు కనిపించారు. శ్రీలంక గెలిచినందుకు అభినందించడానికి, అదేవిధంగా  ఫైనల్‌లో, ముఖ్యంగా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు పాకిస్తాన్ జట్టు ప్రదర్శనను చూసి ఎగతాళి చేయడానికి కూడా ఆప్ఘాన్ ప్రజలు ఉత్సాహం ప్రదర్శించడం గమనార్హం. ప్రస్తుతం సోషల్ మీడియాలకు ఆప్ఘాన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం గమనార్హం.

 


“మమ్మల్ని చాలా సంతోషపెట్టినందుకు ధన్యవాదాలు శ్రీలంక.. శ్రీలంక విజయాన్ని ఆప్ఘనిస్తాన్ ఆస్వాదిస్తోంది. సంబరాలు చేసుకుంటోంది” అని ఒక ఆప్ఘాన్ నెటిజన్ ట్వీట్ చేయడం గమనార్హం.  రెండు మ్యాచ్‌లలో శ్రీలంకను ఓడించలేకపోయినందుకు పాకిస్తాన్‌ను గేలిచేస్తూ ఆప్ఘాన్ నెటిజన్లు ట్రోల్ చేయడం గమనార్హం.

 మరొక నెటిజన్ ఆఫ్ఘనిస్తాన్ అభిమానులు వీధుల్లో డ్యాన్స్ చేస్తూ శ్రీలకం విజయాన్ని సంబరాలు చేసుకుంటున్న వీడియోను పోస్ట్ చేశారు. “శ్రీలంక విజయాన్ని ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఈ విధంగా జరుపుకుంటున్నారు. #AsiaCup2022" అని ట్వీట్ చేశాడు.

దిగ్గజ పాకిస్థానీ బౌలర్ షోయబ్ అక్తర్ పోస్ట్ చేసిన వీడియో వ్యాఖ్యలలో పోస్ట్ చేసిన ఫోటోలో ఆఫ్ఘనిస్తాన్ అభిమాని కూడా పాకిస్తాన్ ఫీల్డింగ్‌పై సరదాగా విరుచుకుపడ్డాడు. ఫైనల్‌లో పాకిస్థాన్ ఓడిపోవడంతో ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన మరో ట్విట్టర్ యూజర్ సంతోషం వ్యక్తం చేశాడు. "పాకిస్థాన్ పతనమే నా సంతోషం" అని వినియోగదారు ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియోలు, వారి పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి.

Follow Us:
Download App:
  • android
  • ios