దయచేసి మా అమ్మ త్వరగా కోలుకోవాలని దేవుడిని కోరుకోండి... అంటూ ఎమోషనల్ పోస్టు చేసిన ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ...

ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ నబీ తల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తన తల్లి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన మహ్మద్ నబీ... ఆమె గురించి ప్రార్థించాలంటూ అభిమానులను కోరాడు...

‘ఓ తల్లి గుండె అమితమైన ప్రేమను అందించగలదు. నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే... దయచేసి మా అమ్మ త్వరగా కోలుకోవాలని దేవుడిని కోరుకోండి. తన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. దేవుడు ఆమెకు ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి అవసరమైన ధైర్యాన్ని, బలాన్ని ఇవ్వాలని... తను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా... దయచేసి ఆమె కోసం ప్రార్థించండి...’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు మహ్మద్ నబీ...

Scroll to load tweet…

మహ్మద్ నబీ పోస్టుకి భారత కామెంటేటర్ హర్షా భోగ్లే... ‘ప్రపంచంలో ది మోస్ట్ స్పెషల్ పర్సన్... ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థస్తున్నా...’ అంటూ రిప్లై ఇచ్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుతో పాటు ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్, పాక్ క్రికెటర్ హసన్ ఆలీ, భారత క్రికెటర్ వాషింగ్టన్ సుందర్, మునాఫ్ పటేల్, సోహైల్ తన్వీర్, క్రికెటర్లు సదీఖ్ మహ్మద్, కోచ్ టామ్ మూడీ... నబీ తల్లికి త్వరగా కోరుకోవాలని కాంక్షిస్తూ కామెంట్లు చేశారు.