ఇంగ్లాండ్ పై విజయం.. సంబరాలు చేసుకున్న ఆప్ఘాన్ మిస్టరీ గర్ల్
తొలుత బ్యాటింగ్ చేసిన 284 పరుగులకు ఆలౌటైన జోస్ బట్లర్ జట్టును ఆఫ్ఘన్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ చేసింది.
వరల్డ్ కప్‌లో భాగంగా ఢిల్లీ వేదికగా అప్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు భంగపాటుకు గురైంది. 285 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో 215 రన్స్‌కే ఆలౌటయ్యింది. 9 ఓవర్లకుపైగా చేతిలో ఉన్నప్పటికీ.. వికెట్లను పారేసుకొని మూల్యం చెల్లించుకుంది.
ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్ 2023లో అరుణ్ జైట్లీలో జరిగిన మ్యాచ్ నం. 13లో టోర్నమెంట్‌లో డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌ను 69 పరుగుల తేడాతో ఓడించి టోర్నీలో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన 284 పరుగులకు ఆలౌటైన జోస్ బట్లర్ జట్టును ఆఫ్ఘన్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ చేసింది.
ఆఫ్ఘనిస్తాన్ మిస్టరీ గర్ల్ , సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన వాజ్మా అయూబీ ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్‌ను 69 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ ఓడించింది. అంటూ సోషల్ మీడియాలో పేర్కొంది. , సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మేము మా మొదటి ప్రపంచ కప్ విజయం సాధించాము. వెల్ డన్ #AfghanAtalan @ACBofficials అంటూ ట్వీట్ చేసింది. ఇదిలా ఉండగా, వాజ్మా అయోబి దుబాయ్‌లో ఉన్న మోడల్, 1995లో ఆఫ్ఘనిస్థాన్‌లో జన్మించిన ఆమె తర్వత దుబాయ్ షిఫ్ట్ అయిపోయారు.
వన్డే వరల్డ్ కప్‌లలో వరుసగా 14 మ్యాచ్‌ల్లో ఓడిన అప్ఘాన్.. ఇంగ్లాండ్‌పై విజయం ద్వారా ఊపిరి పీల్చుకుంది. అప్ఘాన్ జట్టు చివరిసారిగా 2015 వరల్డ్ కప్‌లో స్కాట్లాండ్‌ను ఓడించింది.