పాకిస్తాన్‌పై 228 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న భారత జట్టు, ఆతిథ్య శ్రీలంకతో మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది 

ఆసియా కప్ 2023లో భాగంగా టీమిండియా అదరగొడుతోంది. వరసగా మ్యాచ్ లు గెలుస్తూ, విజయాలను తన ఖాతాలో వేసుకుంటోంది. సోమవారం పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అదరగొట్టింది. టీమిండియా క్రికెటర్ల విద్వంసానికి పాక్ కొట్టుకుపోయింది. టాస్ ఓడిపోయి టీమిండియా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అయితే, 50 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి 356 పరుగులు చరేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ హాఫ్ సెంచరీలు చేశారు. ఆ తర్వాత స్టేడియంలోకి అడుగుపెట్టిన కోహ్లీ, కే ఎల్ రాహుల్ సెంచరీలతో అదరగొట్టారు.

 లక్ష్య చేధన చేయడానికి అడుగుపెట్టిన పాకిస్తాన్ ఘోర ఓటమిని చవి చూసింది. వికెట్లు కాపాడుకోవడంలో విఫలమైంది. బదులుగా పాకిస్తాన్ 128 పరుగులకేు పరిమితమైంది. దీంతో, భారత్ 228 రన్స్ తేడాతో విజయం సాధించింది. పాక్ తో మ్యాచ్ మాత్రమే కాదు, శ్రీలంకతోనే అంతే అదరగొట్టింది. వరుసగా 14 వన్డేల్లో గెలిచి వరల్డ్ రికార్డు కొట్టిన లంకకు భారత జట్టు షాక్ ఇచ్చింది. పాకిస్తాన్‌పై 228 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న భారత జట్టు, ఆతిథ్య శ్రీలంకతో మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది.

Scroll to load tweet…

అయితే, ఈ రెండు మ్యాచ్ ల సమయంలో టీమిండియాకు ఆప్ఘనిస్తాన్ మిస్టరీ గర్ల్ సపోర్ట్ గి నిలవడం విశేషం. ఆఫ్ఘనిస్తాన్ మిస్టరీ గర్ల్ వాజ్మా అయూబీ తన అందమైన రూపానికి మాత్రమే కాకుండా, గత వారం రోజులుగా భారత క్రికెట్ జట్టుకు మద్దతు ఇస్తున్న విధానానికి సోషల్ మీడియా ఫిదా అయిపోయింది. . మంగళవారం రాత్రి, ఆమె తన మరొక చిత్రాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ లో "భారత్ 41 పరుగుల తేడాతో గెలుస్తుంది అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

వాజ్మా అయోబి దుబాయ్‌లో ఉన్న మోడల్, 1995లో ఆఫ్ఘనిస్థాన్‌లో జన్మించిన ఆమె తర్వత దుబాయ్ షిఫ్ట్ అయిపోయారు. పాక్ తో మ్యాచ్ సమయంలోనూ ఆమె టీమిండియా జెర్సీలో కనిపించి మరీ, సపోర్ట్ చేయడం విశేషం. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.