IL T20:కొంతకాలంగా   ఆర్థిక నష్టాలతో సతమతమవుతున్న ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త  గౌతం అదానీకి  ఊరట. ఆయన పెట్టుబడులు పెట్టిన  గల్ఫ్ జెయింట్స్  టీమ్.. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ఐఎల్ టీ20) లో ఘన విజయాన్ని అందుకుంది. 

హిండెన్‌బర్గ్ రిపోర్టుతో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ - 5లో నిలిచిన ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త గౌతం అదానీ సంపద వారం రోజుల్లోనే ఆవిరైపోయింది. స్టాక్ మార్కెట్లలో ఆయన కంపెనీల షేర్ల పతనం ఇంకా కొనసాగుతున్నది. డొల్ల కంపెనీలతో ఆయన దేశ సంపదను కొల్లగొడుతున్నాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న అదానీకి కాస్త ఊరట. యూఏఈ వేదికగా ముగిసిన ఇంటర్నేషనల్ లీగ్ టీ 20 తొలి సీజన్ టైటిల్ ను ఆయన పెట్టుబడులు పెట్టిన గల్ఫ్ జెయింట్స్ టీమ్ దక్కించుకుంది.

గత నెల 13న దుబాయ్ వేదికగా అధికారికంగా ప్రారంభమైన ఈ టోర్నీలో డిసర్ట్ వైపర్స్, గల్ఫ్ జెయింట్స్ టీమ్ లు తుది పోరుకు అర్హత సాధించాయి. వీటి మధ్య ఆదివారం రాత్రి దుబాయ్ లోనే ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన డిజర్ట్ వైపర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.

డిజర్ట్ వైపర్స్ టీమ్ లో వనిందు హసరంగ (27 బంతుల్లో 55, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. మిగిలినవారిలో సామ్ బిల్లింగ్స్ (33) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు. గల్ఫ్ జెయింట్స్ బౌలర్.. కార్లోస్ బ్రాత్‌వైట్ డిజర్ట్ పతనంలో కీలక పాత్ర పోషించాడు. నాలుగు ఓవర్లు వేసిన అతడు.. 19 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. 

Scroll to load tweet…

అనంతరం లక్ష్య ఛేదనలో గల్ఫ్ జెయింట్స్.. 18.4 ఓవర్లలోనే విక్టరీ కొట్టింది. ఆ జట్టు ఓపెనర్ క్రిస్ లిన్.. (50 బంతుల్లో 72 నాటౌట్, 9 ఫోర్లు, 1 సిక్సర్) ధాటిగా ఆడాడు. అతడికి గెర్హార్డ్ ఎరాస్మస్.. (30) అతడికి అండగా నిలిచాడు. షిమ్రాన్ హెట్మెయర్ (13 బంతుల్లో 25 నాటౌట్, 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా మరో 8 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు తీసిన కార్లోస్ బ్రాత్‌వైట్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

Scroll to load tweet…