Asianet News TeluguAsianet News Telugu

అదానీ టీమ్ దూకుడు.. డబ్ల్యూపీఎల్‌లో కోచింగ్ సిబ్బంది నియామకం పూర్తి

WPL 2023: డబ్ల్యూపీఎల్ లో మిగతా జట్లు ఆటగాళ్ల  వేలం  కోసం  పడరాని పాట్లు పడుతుంటే అదానీ టీమ్ (అహ్మదాబాద్) మాత్రం  కోచింగ్ సిబ్బందిని నియమించే పనిని పూర్తి చేసి దూకుడుమీదుంది. 
 

Adani  Owned Gujarat Franchise Appoints Rachael Haynes as Head Coach and Nooshin Al Khadeer as Bowling Coach  MSV
Author
First Published Feb 4, 2023, 12:13 PM IST

బీసీసీఐ తొలిసారిగా నిర్వహించతలపెట్టిన  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో అహ్మదాబాద్ ఫ్రాంచైజీ (గుజరాత్ జెయింట్స్) ని దక్కించుకున్న   ప్రముఖ వ్యాపారవేత్త  గౌతం అదానీ టీమ్  దూకుడు మీదుంది.  డబ్ల్యూపీఎల్ లో మిగతా జట్లు  వేలం  కోసం  పడరాని పాట్లు పడుతుంటే అదానీ టీమ్ మాత్రం  కోచింగ్ సిబ్బందిని నియమించుకుంది. ఇదివరకే ఈ జట్టుకు మెంటార్, అడ్వైజర్ గా  మిథాలీ రాజ్ ఎంపికైన విషయం తెలిసిందే. తాజాగా  గుజరాత్ జెయింట్స్..  టీమ్ హెడ్ కోచ్ తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ లనూ వెల్లడించింది.

గుజరాత్ జెయింట్స్ కు హెడ్‌కోచ్ గా ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్   రేచల్ హేన్స్  ఎంపికైంది.  ఆస్ట్రేలియా జట్టు తరఫున నాలుగు ప్రపంచకప్ లు గెలిచిన జట్టులో సభ్యురాలిగా ఉన్న ఆమె.. త్వరలోనే హెడ్ కోచ్ అవతారమెత్తనున్నారు. 

రేచల్ హేన్స్ ను హెడ్ కోచ్ గా నియమించిన  ఆ జట్టు.. ఇటీవలే  అండర్ - 19 టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు  హెడ్ కోచ్ గా ఉన్న  నూషిన్ అల్ ఖాదిర్ ను  బౌలింగ్ కోచ్ గా ఎంచుకుంది.   తుషార్ అరోథ్  బ్యాటింగ్ కోచ్ బాధ్యతలను, గవన్ ట్వినింగ్ పీల్డింగ్ కోచ్ గా వ్యవహరించనున్నారని   ఫ్రాంచైజీ  ఒక ప్రకటనలో తెలిపింది.  

 

హేన్స్..  ఆస్ట్రేలియా తరఫున   167 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడింది. ఇందులో  ఆరు టెస్టులు,  77 వన్డేలు, 84 టీ20లు ఉన్నాయి.  2009 నుంచి  2022 వరకూ జట్టులో కీలక సభ్యురాలిగా కొనసాగింది.    36 ఏండ్ల ఈ వెటరన్ క్రికెటర్..  2013, 2022లో   వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యురాలిగా ఉంది. అంతేగాక  2018, 2020లో  టీ20  ప్రపంచకప్  నెగ్గిన టీమ్ లో  కీలక పాత్ర పోషించింది.  బిగ్ బాష్ లీగ్ లో  హేన్స్.. సిడ్నీ థండర్స్ తరఫున ఆడింది. ఈ లీగ్ లో  అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో ఆమె కూడా ఉంది.  

 

కాగా ఇదివరకే  ఫ్రాంచైజీల వేలం ముగిసిన డబ్ల్యూపీఎల్ లో   ఈనెల రెండో వారంలో ఆటగాళ్ల వేలం జరుగనుంది.  మార్చి మొదటివారంలో   ఈ లీగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి.   మార్చి  26 వరకు డబ్ల్యూపీఎల్ ను పూర్తి చేసి ఆ తర్వాత మెన్స్ ఐపీఎల్ ను ప్రారంభించేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios