Asianet News TeluguAsianet News Telugu

IND vs PAK: ప్రపంచకప్‌‌‌కు ముందే పాకిస్తాన్‌తో మరోసారి తలపడనున్న టీమిండియా.. షెడ్యూల్ ఇదే..

Women's Asia Cup 2022: భారత్-పాకిస్తాన్ మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా  దానికుండే మజానే వేరు. ఇటీవలే ముగిసిన ఆసియా కప్-2022లో  దాయాది దేశాలు  రెండు వారాలలో రెండు సార్లు తలపడ్డాయి. 

ACC Announces Women's Asia Cup T20 2022 Schedule, India will Face Pakistan On October 7
Author
First Published Sep 21, 2022, 1:35 PM IST

చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న భారత్-పాకిస్తాన్ మధ్య  వచ్చే నెల అక్టోబర్ 23న  టీ20 ప్రపంచకప్ సందర్భంగా మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కు ముందు దాయాది దేశాలు మరోసారి తలపడనున్నాయి. అయితే ఈసారి ఆడబోయేది పురుషుల జట్టు కాదు. మహిళా క్రికెట్ జట్లు.  అక్టోబర్ 8 న ఈ రెండు జట్లూ ఢీకొనబోతున్నాయి. మహిళల ఆసియా కప్ లో భాగంగా  ఈ  మ్యాచ్ జరుగనుంది. 

పురుషుల ఆసియా కప్ ముగిసిన తర్వాత  ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఇప్పుడు మహిళల టోర్నీ నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తున్నది. అక్టోబర్ 1 నుంచి బంగ్లాదేశ్ వేదికగా ఈ మెగా టోర్నీ నిర్వహణకు  ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ మేరకు ఏసీసీ అధ్యక్షుడు జై షా.. మహిళల ఆసియా కప్ షెడ్యూల్ ను  ట్విటర్ లో విడుదల చేశాడు. అక్టోబర్ 1 నుంచి 15 వరకు జరిగే ఈ టోర్నీలో పాల్గొనే జట్ల వివరాలు, షెడ్యూల్, తదితర వివరాలు ఇక్కడ చూద్దాం. 

- పురుషులు  ఆసియా కప్ లో 6 జట్లు పాల్గొనగా మహిళల టోర్నీలో మాత్రం ఏడు జట్లు పాల్గొంటున్నాయి. 
- ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మలేషియా, యూఏఈ, థాయ్లాండ్ లు  బరిలో ఉన్నాయి.
- ఏసీసీలో అఫ్గానిస్తాన్ సభ్యదేశంగా ఉన్నా తాలిబన్లు  తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పట్నుంచి  మహిళల క్రికెట్ జట్టును ఆడటానికి అనుమతించకపోవడంతో ఆ దేశం  పాల్గొనడం లేదు.  
- 15 రోజుల పాటు సాగే ఈ టోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇస్తున్నది. 
- రౌండ్ రాబిన్  ఫార్మాట్ లోనే మ్యాచ్ లు జరుగుతాయి. గ్రూప్ దశలో   టాప్-4 జట్లు సెమీస్ కు చేరతాయి. 
- అక్టోబర్ 1న మొదలయ్యే ఈ టోర్నీలో.. 13న రెండు సెమీస్ లు, 15న ఫైనల్ జరుగుతాయి.
- టీ20 ఫార్మాట్ లోనే ఈ మ్యాచ్ లు జరుగుతాయి. 

 

ఇక షెడ్యూల్ లో భారత్ మ్యాచ్ ల విషయానికొస్తే.. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు అక్టోబర్ 1న శ్రీలంక మహిళల జట్టుతో  మ్యాచ్ ద్వారా  ఈ టోర్నీని ప్రారంభించనున్నది.  ఆ తర్వాత 3న మలేషియాతో, 4న యూఏఈతో, 7న పాకిస్తాన్  తో, 8న బంగ్లాదేశ్, 10న థాయ్లాండ్ తో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.  

భారత జట్టు ప్రకటన.. 

ఆసియా కప్ లో పాల్గొనేందుకు గాను బీసీసీఐ జట్టును కూడా ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు  హర్మన్ ప్రీత్ సారథ్యం వహించనున్నది. 

ఆసియా కప్ కు భారత జట్టు : హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, సబ్బినేని మేఘన, రిచా ఘోష్, స్నేహ్ రాణా, డయలన్ హేమలత,  మేఘనా సింగ్, రేణుకా ఠాకూర్, పూజా వస్త్రకార్, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, కె.పి. నవ్గిరె 

స్టాండ్ బై ప్లేయర్లు : తనియా సప్న భాటియా, సిమ్రన్ దిల్ బహదూర్

 

Follow Us:
Download App:
  • android
  • ios