అబుదాబి టీ10 లీగ్‌లో శ్రీలంక స్పిన్నర్ కేవిన్ కొత్తిగోడ వింత బౌలింగ్ యాక్షన్...తల దించి, మెడ వెనక నుంచి చేతిని తిప్పుతూ బౌలింగ్....బౌలింగ్ చేస్తూ కిందపడిపోయిన కొత్తిగోడ...

ఒక్కో బౌలర్, ఒక్కో బాడీ లాంగ్వేజ్, యాక్షన్‌తో బౌలింగ్ చేస్తుంటారు. అయితే కొందరి బౌలింగ్ యాక్షన్ చూడడానికి మరీ వింతగా ఉంటుంది. అబుదాబి టీ10 లీగ్‌లో ఇలాంటి ఓ వింతైన బౌలింగ్ యాక్షన్‌తో క్రికెట్ ప్రేక్షకులను విస్తుపోయేలా చేశాడు శ్రీలంక స్పిన్నర్ కేవిన్ కొత్తిగోడ.

మరఠా అరేబియన్స్ తరుపున ఆడుతున్న కొత్తిగోడ, లాహర్ క్వాలండర్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేసి గాయపడ్డాడు. కొత్తిగోడ బౌలింగ్ చేస్తున్న సమయంలో క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్ టామ్ బాంటన్, అతని బౌలింగ్‌ యాక్షన్‌ను చూసి ఆశ్చర్యపోయాడు. తల కిందకు వంచి, మెడ వెనక నుంచి చేతిని తిప్పుతూ బౌలింగ్ చేశాడు కొత్తిగోడ.

బౌలింగ్ చేస్తూ కిందపడిపోయిన కొత్తిగోడ, లేచి బ్యాట్స్‌మెన్‌ను రనౌట్ చేశాడు. జనవరి 28న మొదలైన అబుదాబి టీ10 లీగ్, ఫిబ్రవరి 6న ముగియనుంది. 

View post on Instagram