తమిళనాడు ప్రీమియ్ లీగ్ 2023లో ఒకే బంతికి 18 పరుగులు సమర్పించిన అభిషేక్ తన్వార్.. నాలుగు నో బాల్స్, ఓ వైడ్‌తో చెత్త రికార్డు...

ఒక్క బంతికి 6 పరుగులు ఇస్తేనే ఆ బౌలర్‌ని ఆటాడుకుంటాడు. అలాంటిది ఒక్క బంతికి 18 పరుగులు ఇస్తే... ఇంకేమైనా ఉందా! అయినా ఒక్క బంతికి 18 పరుగులు ఎలా ఇచ్చాడు... ఇది జరిగింది పొరుగు రాష్ట్రం తమిళనాడులో జరుగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL)లో..

ఐపీఎల్, ఐసీసీ డబ్ల్యూటీసీ ముగిశాక క్రికెట్ ఫ్యాన్స్ తెగ బోర్ ఫీలవుతున్నారు. అయితే తమిళనాడు ఫ్యాన్స్ మాత్రం టీఎన్‌పీఎల్‌ (తమిళనాడు ప్రీమియర్ లీగ్‌) ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో చోటు దక్కించుకోలేకపోయిన టీమిండియా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా తమిళనాడు ప్రీమియర్ లీగ్‌‌ ఆడబోతున్నట్టు ప్రకటించాడు..

Scroll to load tweet…

 తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో సాలెం స్పార్టన్స్ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఫాస్ట్ బౌలర్ అభిశేక్ తన్వార్, చెపాక్ సూపర్ గిల్లీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ బౌలింగ్‌ వేశాడు. తొలి 5 బంతుల్లో 7 పరుగులు ఇచ్చిన అభిషేక్ తన్వార్, ఆఖరి బంతి వేసి ఓవర్‌ని ఫినిష్ చేసేందుకు అష్టకష్టాలు పడ్డాడు..

ఆఖరి బంతికి బ్యాటర్ సంజయ్ యాదవ్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు అభిషేక్ తన్వార్, అయితే అది నో బాల్‌గా తేలడంతో అతను నాటౌట్‌గా తేలాడు. వికెట్ తీశానని సెలబ్రేట్ చేసుకున్న సంజయ్ యాదవ్ నిరాశగా మళ్లీ బాల్ వేశాడు. ఈసారి సంజయ్ యాదవ్ సిక్సర్ బాదాడు. అయితే అది కూడా నో బాల్ తేలింది..

ఆ తర్వాతి బంతికి సంజయ్ యాదవ్ 2 పరుగులు తీశాడు. అది కూడా నో బాల్‌గా ఇచ్చాడు అంపైర్. ఆ తర్వాతి బంతి వైడ్‌గా వెళ్లింది. ఆ తర్వాతి బంతికి సిక్సర్ బాదిన సంజయ్ యాదవ్, ఇన్నింగ్స్‌ని ఘనంగా ముగించాడు..

ఆఖరి బంతి ఫినిష్ చేసేందుకు మూడు నో బాల్స్, ఓ వైడ్ వేసిన అభిషేక్ తన్వార్, ఆఖరి బంతికి ఏకంగా 18 పరుగులు సమర్పించేసి చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు.. ఆఖరి బంతి వేయడానికి ముందు 199/5 స్కోరు వద్ద ఉన్న చెపాక్ సూపర్ గిల్లీస్, ఆఖరి బంతి ముగిసే సరికి 217/5 స్కోరుకి చేరుకుంది..

నో బాల్‌కి క్లీన్ బౌల్డ్ అయిన సంజయ్ యాదవ్, 12 బంతుల్లో 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆఖరి ఓవర్‌లో మొత్తంగా 5 నో బాల్స్, ఓ వైడ్‌తో 25 పరుగులు సమర్పించిన అభిషేక్, 4 ఓవర్లలో ఓ వికెట్‌ తీసి 44 పరుగులు సమర్పించాడు.

218 పరుగుల భారీ లక్ష్యఛేదనలో స్పార్టన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులకి పరిమితమైంది. దీంతో చెపాక్ సూపర్ గిల్లీస్‌ 52 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది...

‘ఆఖరి ఓవర్‌లో నాలుగు నో బాల్స్ వేయడమే మ్యాచ్‌ని మలుపు తిప్పింది. సీనియర్ బౌలర్‌గా ఉన్న నేను ఈ ఓటమికి బాధ్యత వహిస్తున్నా. వేగంగా వీచిన గాలి కూడా నో బాల్స్ వేళ్లడానికి ప్రధాన కారణం..’ అంటూ కామెంట్ చేశాడు అభిషేక్ తన్వార్..