Asianet News TeluguAsianet News Telugu

ముంబైలో గల్లీ క్రికెట్ ఆడిన డివిలియర్స్.. వీడియో వైరల్

దక్షిణాఫ్రికా మాజీ సారథి, ఐపీఎల్ లో  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడే ఏబీ డివిలియర్స్ ప్రస్తుతం ఇండియాలో ఉన్నాడు. ఐపీఎల్ - 2023 ప్రిపరేషన్స్ లో భాగంగా అతడు ఇండియాకు వచ్చాడు. 

AB de Villiers played Gully Cricket in Mumbai Streets, Video Went Viral
Author
First Published Nov 8, 2022, 1:30 PM IST

సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కు భారత్ తో ఉన్న అనుబంధం ప్రత్యేకమైంది. ఈ విషయాన్ని గతంలో అతడు చాలాసార్లు బహిరంగంగానే చెప్పాడు. ఇక బెంగళూరును తన రెండో ఇంటిగా పరిగణించే మిస్టర్ 360.. ప్రస్తుతం ఇండియాలోనే ఉన్నాడు.  2021లో ఐపీఎల్ నుంచి నిష్క్రమించాక గతేడాది అతడు  అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా ఐపీఎల్-2023 కోసం  ఇండియాకు వచ్చిన డివిలియర్స్.. ముంబై గల్లీలలో  క్రికెట్ ఆడాడు. 

ఐపీఎల్ - 2023  ప్రిపరేషన్స్ లో భాగంగా  ఇటీవలే ఇండియాకు వచ్చిన ఏబీడీ.. వేలం, ఆటగాళ్ల ఎంపికకు సంబంధించిన విషయాలను చూసుకుంటున్నాడు.  బెంగళూరు నుంచి ముంబైకి చేరుకున్న డివిలియర్స్  అక్కడ సచిన్ ను కూడా కలిశాడు. 

సోమవారం  డివిలియర్స్.. ముంబైలో గల్లీ క్రికెట్ ఆడుతున్న  పిల్లల దగ్గరకు వచ్చి  తాను కూడా వాళ్లతో కలిసిపోయాడు.  ఎన్నో అంతర్జాతీయ వేదికలపై మెరుపులు మెరిపించిన మిస్టర్ 360.. గల్లీలో అది చాలీ చాలని బ్యాట్, సరిగ్గా లేని వెలుతురు లో క్రికెట్ ఆడి ఫ్యాన్స్ ను ఖుషీ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. 

 

గల్లీ క్రికెట్ ఆడటానికంటే ముందు డివిలియర్స్.. సచిన్ తో కలిసి  ముంబైలో బ్రేక్ ఫాస్ట్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అతడు సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ సందర్భంగా డివిలియర్స్.. ‘సచిన్ ను కలవడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూశాను.  నేను ఎప్పుడూ కలవాలనుకునే వ్యక్తులలో సచిన్ కూడా ఒకడు. రిటైర్మెంట్ తర్వాత కూడా సచిన్ ఏమీ మారలేదు.  ఇప్పటికీ నాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు..’ అని రాసుకొచ్చాడు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios