Asianet News TeluguAsianet News Telugu

6, 6, 6, 6.. రోహిత్ శ‌ర్మ సిక్స‌ర్ల వ‌ర్షం.. ఆస్ట్రేలియాకు కు దిమ్మ‌దిరిగే షాక్.. !

Rohit Sharma: ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాట్ పని చేయలేదు. కానీ, కెప్టెన్ రోహిత్ శ‌ర్మ విధ్వంసం సృష్టించాడు. వ‌ర్షానికి తోడుగా త‌న బ్యాట్ తో సిక్స‌ర్ల వ‌ర్షం కురిపిస్తూ ఆస్ట్రేలియా బౌలింగ్ ను చిత్తు చేశాడు. 150+ వేగంతో బంతులు వేసే మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో వ‌రుస సిక్స‌ర్ల‌తో విరుచుకుపడ్డాడు. 
 

6 6  6 6.. Rohit Sharma who broke with consecutive sixes.. A shocking shock for Australia in the T20 World Cup RMA
Author
First Published Jun 24, 2024, 10:16 PM IST | Last Updated Jun 24, 2024, 10:32 PM IST

IND vs AUS : టీ20 వరల్డ్ కప్ 2024 సూపర్-8 రౌండ్‌లో భారత్-ఆస్ట్రేలియాలు సెయింట్ లూసియాలోని డారెన్ సామీ క్రికెట్ గ్రౌండ్‌లో త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాకు డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్ గెలిస్తేనే ఆ జ‌ట్టు టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 లో ఉండే అవ‌కాశాలు ఉన్నాయి. ఓడితే ఇంటిముఖం ప‌డుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అష్టన్ అగర్ స్థానంలో మిచెల్ స్టార్క్ చోటు ద‌క్కింది. భారత జట్టులో ఒక్క మార్పు కూడా లేదు. భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అద్భుత‌మైన ఆట‌తో ఆస్ట్రేలియా బౌలింగ్ ను ఉతికి పారేశాడు.

రోహిత్ బ్యాట్ ప‌నిచేయ‌లేదు.. 

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాట్ పని చేయలేదు. అంత‌కుముందు మ్యాచ్ లో మంచి ట‌చ్ లో క‌నిపించాఉ. అయితే, ఈ మ్యాచ్ లో ఖాతా తెరవకుండానే పెవిలియ‌న్ కు చేరాడు. జోష్ హేజిల్ వుడ్ బౌలింగ్ లో బౌన్సీ బాల్ ను బిట్ షాట్ ఆడి క్యాచ్ రూపంలో బౌండ‌రీ లైన్ వ‌ద్ద‌ టిమ్ డేవిడ్ దొరికిపోయాడు. దీంతో భారత్ 2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది. 

రోహిత్ శ‌ర్మ విశ్వ‌రూపం.. స్టార్క్ ను ఏడిపించాడు భయ్యా.. 

ఏప్పుడైతే విరాట్ కోహ్లీ ఔట్ అయ్యాడో అప్ప‌టి నుంచి రోహిత్ శ‌ర్మ త‌న విశ్వ‌రూపం చూపించాడు. వ‌రుస సిక్స‌ర్ల‌తో ప‌రుగుల సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. రికార్డుల మోత మోగించాడు. విరాట్ కోహ్లీ సున్నాకి అవుటైన తర్వాత, రోహిత్ శర్మ భారత ఇన్నింగ్స్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. కేవ‌లం 14 బంతుల్లో 41 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్న స‌మ‌యంలో వ‌ర్షం ప‌డ‌టంతో మ్యాచ్ కు కాస్త అంత‌రాయం ఏర్ప‌డింది. అప్ప‌టికే హిట్ మ్యాన్ 2 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు. అప్పుడు భారత్ 4.1 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. స్టార్క్ వేసిన బౌలింగ్ లో 4 సిక్స‌ర్లు, ఒక ఫోర్ తో 29 ప‌రుగులు రాబ‌ట్టాడు.

T20 WORLD CUP 2024 : వెస్టిండీస్ కు బిగ్ షాక్.. సెమీ ఫైన‌ల్ కు దక్షిణాఫ్రికా

వ‌ర్షం త‌గ్గ‌డంతో మ‌ళ్లీ తిరిగి మ్యాచ్ ప్రారంభం కావ‌డంతో రిష‌బ్ పంత్ తో క‌లిసి మ‌ళ్లీ త‌న బ్యాట్ సునామీని కొన‌సాగించాడు. మ‌ళ్లీ ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ్డాడు. ఈ క్ర‌మంలోనే 19 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ సాధించాడు హిట్ మ్యాన్. ఇది ఈ వ‌రల్డ్ క‌ప్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీ కావ‌డం విశేషం. అయితే, ఆ స్ట్రేలియాపై రోహిత్ శర్మ 8 ప‌రుగుల దూరంలో సెంచరీ కోల్పోయాడు. 41 బంతుల్లో 92 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. రోహిత్ స్ట్రైక్ రేట్ 224.39. 12వ ఓవర్ రెండో బంతికి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  సూర్య కుమార్ యాద‌వ్ 31, శివ‌మ్ దుబే 28, హార్ధిక్ పాండ్యా 28* ప‌రుగుల ఇన్నింగ్స్ ఆడ‌టంతో టీమిండియా 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 205 ప‌రుగులు చేసింది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios