ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, కోచ్ రవిశాస్త్రి మధ్య ట్విట్టర్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది
ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, కోచ్ రవిశాస్త్రి మధ్య ట్విట్టర్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ధోని కొట్టిన ఫినిషింగ్ షాట్ వీడియోను శాస్త్రి శుక్రవారం ట్విట్టర్‌లో షేర్ చేశాడు.
1983 తరహాలోనే వన్డే ప్రపంచకప్‌ను గెలిచారని క్యాప్షన్ పెట్టాడు. అయితే ఆ ట్వీట్‌ను సచిన్, విరాట్ కోహ్లీలకి మాత్రమే రవిశాస్త్రి ట్యాగ్ చేయడంపై యువరాజ్ నోచ్చుకున్నాడు.
వెంటనే ‘‘ థ్యాంక్స్ సీనియర్ నువ్వు నాకు, మహీకి కూడా ఆ ట్వీట్‌ను ట్యాగ్ చేసి ఉండాల్సింది. ఎందుకంటే తామిద్దరం కూడా వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఉన్నామని పేర్కొన్నాడు. ఆ వెంటనే యువీకి ఫన్నీగా బదులిచ్చిన శాస్త్రి.. ‘‘ ప్రపంచకప్‌ల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు.. నువ్వు జీనియర్‌వి కాదు, దిగ్గజానివని ప్రశసించాడు.
మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో భారత్ గెలుచుకున్న రెండు ప్రపంచకప్ టోర్నమెంట్లు ( 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్)లలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 2007 టీ20 వరల్డ్ కప్ సందర్భంగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన యువీ.. టీమిండియా కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
Also Read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: ఈ చెఫ్ టీమిండియా క్రికెటర్.. ఎవరో గుర్తు పట్టారా..?
ఇక 2011 వన్డే ప్రపంచకప్ టోర్నీ మొత్తం తన ఆల్‌రౌండ్ ఫార్ఫామెన్స్‌తో అదరగొట్టిన యువరాజ్ సింగ్ బ్యాట్, బాల్ రెండింటితోనూ రాణించాడు. ఫైనల్లో తన స్పిన్ బౌలింగ్‌తో రెండు వికెట్లు పడగొట్టడమే కాకుండా, బ్యాటింగ్‌లోనూ ధోనికి మద్ధతుగా నిలిచాడు. దీంతో యువరాజ్ సింగ్ మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డుకు ఎంపికయ్యాడు.
