16 ఏళ్లకే సెంచరీ చేసిన ఐర్లాండ్ మహిళా క్రికెటర్ అమీ హంటర్... 22 ఏళ్ల నాటి మిథాలీరాజ్ రికార్డు బ్రేక్... బర్త్ డే రోజున టాప్ స్కోరు చేసిన క్రికెటర్‌గానూ...

ఐర్లాండ్ క్రికెట్‌లో సంచలనం క్రియేట్ అయ్యింది. 16 ఏళ్ల అమీ హంటర్, జింబాబ్వేతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో సెంచరీ చేసి, అతి పిన్న వయసులో సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. ఇంతకుముందు ఈ రికార్డు భారత కెప్టెన్ మిథాలీరాజ్ పేరిట ఉంది.

1999లో 16 ఏళ్ల 205 రోజుల వయసులో మిథాలీరాజ్, ఐర్లాండ్‌పైనే సెంచరీ చేస్తే, 22 ఏళ్ల తర్వాత ఐర్లాండ్ క్రికెటర్ అమీ హంటర్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. తన పుట్టినరోజునే సెంచరీ చేసిన అమీ హంటర్, విదేశాల్లో సెంచరీ చేసిన మొట్టమొదటి ఐర్లాండ్ మహిళా క్రికెటర్‌గానూ రికార్డు క్రియేట్ చేసింది...

127 బంతుల్లో 7 ఫోర్లతో 121 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన అమీ హంటర్, ఐర్లాండ్ తరుపున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదుచేసింది. అలాగే అమీ హంటర్ సెంచరీతో 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 312 పరుగులు చేసింది ఐర్లాండ్ మహిళా జట్టు. ఇది వారి అత్యధిక స్కోరు కావడం విశేషం...

Scroll to load tweet…

తన పుట్టినరోజునే సెంచరీ చేసి, అత్యధిక పరుగులు చేసిన నాలుగో క్రికెటర్‌గా నిలిచింది అమీ హంటర్. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ 1998లో తన పుట్టినరోజున 134 పరుగులు చేయగా, రాస్ టేలర్ 131, సనత్ జయసూర్య 130 పరుగులతో టాప్ 3లో ఉన్నారు. మహిళా క్రికెటర్ల విషయంలో మాత్రం అమీయే టాప్ స్కోరర్...