వెల్లింగ్టన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లో పస తగ్గుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రపంచంలో మేటి బ్యాట్స్ మన్ గా పేరు పొందిన విరాట్ కోహ్లీ ఇటీవల ఏ మాత్రం రాణించడం లేదు. వెల్లింగ్టన్ లో న్యూజిలాండ్ పై జరుగుతున్న తొలి టెస్టు మ్యాచులో అత్యంత చెత్తగా అతను అవుటయ్యాడు. 

విరాట్ కోహ్లీ జెమీసన్ బౌలింగులో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. న్యూజిలాండ్ పర్యటనలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ మరింత దిగదుడుపుగా ఉంది. న్యూజిలాండ్ గడ్డపై జరిగిన మూడు ఫార్మాట్లకు సంబంధించి 8 ఇన్నింగ్సుల్లో కోహ్లీ ఒక్క అర్థ సెంచరీ మాత్రం చేయగలిగాడు. 

Also Read: కివీస్ బౌలర్ జెమీసన్ దెబ్బ: తొలి రోజు భారత్ స్కోరు 122/5

బంగ్లాదేశ్ పై 2019 నవంబర్ లో బంగ్లాదేశ్ పై జరిగిన మ్యాచులో అతను 136 పరుగులు చేశాడు. గత 19 ఇన్నింగ్సుల్లో విరాట్ కోహ్లీ మూండంకెల స్కోరును చేయలేకపోయాడు. తన 11 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో విరాట్ కోహ్లీ 2 దశల్లో మాత్రమే 19కి పైగా ఇన్నింగ్సుల్లో సెంచరీలు సాధించలేకపోయాడు. 

 2011 ఫిబ్రవరి, సెప్టెంబర్ మధ్య కాలంలో కోహ్లీకి ఏ మాత్రం బాగా లేని తొలిదశ.  వరుసగా 24 ఇన్నింగ్సుల్లో అతను ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. కోహ్లీ బ్యాటింగ్ సగటు 48కి పడిపోయింది. అదే విధంగా 2014 ఫిబ్రవరి, అక్టోబర్ మధ్య కాలంలో వరుసగా 25 ఇన్నింగ్సుల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఇది విరాట్ కోహ్లీకి మూడో చెత్త ప్రదర్శన.

ఈ మూడు దశల్లోనూ కోహ్లీ అర్థ సెంచరీలు కూడా తక్కువే ఉన్నాయి. 19 ఇన్నింగ్సులో అతను 6 అర్థ సెంచరీలు చేయగా, 2014 దశలో ఆరు అర్థ సెంచరీలు మాత్రమే చేశాడు. 2011 దశలో 4 అర్థ సెంచరీలు సాధించాడు.