కరోనా వైరస్ దేశంలో రోజు రోజుకీ విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ కేసుల సంఖ్య ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి. ఈ కరోనా కారణంగా గత నెలలో మొదలవ్వాల్సిన ఐపీఎల్ 13 సీజన్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా... అసలు ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతుందా లేదా అనే విషయంపై నేడు క్లారిటీ రానుంది.

Also Read ఫార్మాట్ మారినా, వేదిక మారినా... ఏషియా కప్ కి కలిసిరాని కాలం!...

 ప్రస్తుత లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్‌ జరుగుతుందా? లేదా అన్నది అనుమానంగా మారింది. ఇప్పటికే లీగ్‌ను ఈనెల 14 దాకా వాయిదా వేసిన బీసీసీఐ.. తాజాగా కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగించే యోచనలో ఉండడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై మల్ల గుల్లాలు పడుతోంది. అయితే, కేంద్రం నిర్ణయంపై వేచి చూస్తున్నామనీ.. ఆ తర్వాతే ఐపీఎల్‌ భవిత వ్యాన్ని నిర్ణయించనున్నట్టు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ వెల్లడించాడు. అయినా, జనజీవనమే స్తంభించిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆటలకు చోటే లేనప్పుడు.. లీగ్‌ నిర్వహణ ఎలా సాధ్యమవుతుం దంటూ? దాదా పరోక్షంగా ఐపీఎల్‌ లేనట్టేనన్న సంకే తాలిచ్చాడు. 

‘సోమవారం ఐపీఎల్‌పై స్పష్టత ఇస్తా. నిజం చెప్పాలంటే.. లాక్‌డౌన్‌ కారణంగా జనజీవనం స్తంభించిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో క్రీడలకు చోటెక్కడిది? ఏదేమైనా ఐపీఎల్‌ నిర్వహణ సాధ్యా సాధ్యాలపై సోమవారం వివరాలు వెల్లడిస్తాం’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. దీంతో.. నేడు ఏం చెప్పనున్నాడా అని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.