ముంబై: భార్య రితిక కోసం టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అత్యంత ప్రేమాదస్పదమైన సందేశాన్ని పోస్టు చేశాడు. తమ ఇద్దరి ఫొటోలను జత చేస్తూ రోహిత్ శర్మ జీవితంలో మరిచిపోలేని వ్యాఖ్యను రితిక కోసం ట్వీట్ చేశాడు. 

"నువ్వు లేని నా జీవనయానాన్ని ఊహించలేను" అని అన్నాడు. ఇంతకన్నా ఉత్తమమైందేదీ ఉండదు. ఐ లవ్ యూ అని ట్వీట్ చేశాడు. వాటితో పాటు కొన్ని ఎమోజీలు కూడా జత చేశాడు. రోహిత్ శర్మ 2015లో రితికను వివాహం చేసుకున్నాడు. 

దాదాపు ఆరేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత వీరి పెళ్లి  జరిగింది. వారికి ఓ కూతురు కూడా ఉంది. త్వరలో ఏడాది పాప అవుతుంది. రోహిత్ శర్మ ట్వీట్ కు అభిమానులు ఫిదా అయిపోయారు. అభినందనలు కూడా చెప్పారు. 

మీ ఇద్దరి ఆనందదాయకమైన వివాహ మహోత్సవం అంటూ ఓ ఫ్యాన్ ట్వీట్ చేశాడు. ఆత్మల ఐక్యతకు వాస్తవ జీవితానికి అత్యంత ఉత్తమమైన నిర్వచనం అని మరొకరు ట్వీట్ చేశారు. ఇలా ప్రతిస్పందనల వర్షం కురుస్తూనే ఉంది.