టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తన ముద్దుల కుమార్తెను చూసి మురిసిపోతున్నాడు. షమీ కుమార్తె ఐరా షమీ చీర కట్టుకుంది. పసుపు రంగు చీర, ఎరుపు రంగు జాకెట్ తో క్యూట్ గా ఉంది. దీంతో ఆ ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన షమీ... ‘‘ చీరలో ముద్దుగా ఉన్నావంటూ’’ క్యాప్షన్ పెట్టాడు. కూతురిని ఎంతగానే ప్రేమిస్తున్నానని.. దేవడి ఆశీస్సులు తనకు ఎప్పుడూ వెంట ఉండాలని కోరుకుంటున్నానని,, త్వరోలనే కలుద్దామంటూ పోస్టు చేశాడు.

Also Read బుమ్రా సూపర్ ఓవర్ బౌలింగ్ పై మంజ్రేకర్ ట్వీట్ .. ఏకిపారేసిన నెటజన్లు..

కాగా షమీ పోస్టుకి నెటిజన్ల స్పందన బాగుంది. నిజంగానే క్యూట్ గా ఉంది అంటూ నెటిజన్లు రిప్లైలు ఇస్తున్నారు.  ఇదిలా ఉండగా... షమీ తన భార్య హసీన్ జహాన్ తో దూరంగా ఉంటున్నాడు. గతంలో హసీన్ జహాన్.. షమీ పై పలు సంచలన ఆరోపణలు చేశారు. కానీ అవన్నీ అబద్దాలని తేలాయి.

ప్రస్తుతం షమీ న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నారు. ఇప్పటికే ఐదు టీ20 మ్యాచుల్లో టీమిండియా 3-0 ఆధిక్యంలో నిలిచి సరీస్ ని కైవసం చేసుకుంది. కాగా మూడో టీ20లో బుమ్రా విఫలమైనా షమీ మాత్రం చివరి ఓవర్లో చివరి బంతికి రాస్ టేలర్ ను బౌల్డ్ చేసి న్యూజిలాండ్ గెలవాల్సిన మ్యాచ్ ని టైగా ముగించాడు. తర్వాత సూపర్ ఓవర్ పెట్టడంతో టీమిండియా విజయం సాధించింది. కాగా మరికాసేపట్లో నాలుగో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది.