కోల్ కతా: ఆస్ట్రేలియాపై 2001 మార్చిలో జరిగిన టెస్టు మ్యాచును బహుశా చాలా మంది మరిచిపోయి ఉండకపోవచ్చు. ఈ మ్యాచులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తీవ్రమైన ఉత్కంఠ కూడా నెలకొంది. కొద్ది మంది వ్యక్తిగత ప్రదర్శనలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. 

వివియస్ లక్ష్మణ్ 281 పరుగులు చేశాడు. రాహుల్ ద్రావిడ్ తో కలిసి 376 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. హర్భజన్ సింగ్ వ్యక్తిగత ప్రదర్శన కూడా అంతే గొప్పగా నిలిచింది. అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఒత్తిడితో హర్భజన్ సింగ్ టెస్టు మ్యాచులోకి వచ్చాడు. ఆస్ట్రేలియాపై జరిగిన తొలి ఇన్నింగ్స్ లో హ్యాట్రిక్ సాధించాడు. మ్యాచులో మొత్తం 13 వికెట్లు తీసుకున్నాడు. హర్భజన్ సింగ్ ప్రదర్శనను ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గుర్తు చేశాడు. 

"వాళ్లు దాన్ని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. హర్భజన్ సింగ్ 14 వికెట్లు తీసుకోవడాన్ని నేను చూశాను. భారత క్రికెట్ లో మార్పులు జరుగుతాయని భావించిన సందర్భంలో ఓ క్రికెటర్ కు అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అవుతుంది" అని సౌరవ్ గంగూలీ ఇండియా టుడేతో అన్నారు.

ఆ తర్వాత 800 వికెట్లు తీసుకున్నందుకు తానేమీ ఆశ్చర్యపడలేదని, అనిల్ కుంబ్లే, హర్భజన్ కలిసి తీసుకున్న వికెట్ల సంఖ్యను చూస్తే భారత్ అంతకు ముందు ఇంతటి ఉత్తమ స్పన్నర్లు లేరనిపనిస్తుందని, టెస్టు మ్యాచుల్లో వారు చూపిన ప్రభావాన్ని బట్టి కూడా అలా అనిపిస్తుందని ఆయన అన్నారు. 

అనిల్ కుంబ్లే గాయం కారణంగా ఆ మ్యాచుకు దూరమయ్యాడు. బలమైన ఆస్ట్రేలియాపై తలపడడానికి గంగూలీకి కుంబ్లేకు తగిన ప్రత్యామ్నాయం కనిపించలేదు. అప్పటికే ఆస్ట్రేలియా 15 మ్యాచుల విజయంతో ఊపు మీద ఉంది. 

భారత్ కు ఉన్న అతి బలమైన బౌలర్లు అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్ ఇద్దరూ మ్యాచుకు అందుబాటులో లేరని, హర్భజన్ కొత్తవాడని, మూడు విభిన్నమైన టెస్టు మ్యాచుల్లో ముగ్గురు విభిన్నమైన స్పిన్నర్లతో ఆడానని గంగూలీ చెప్పాడు. మొదటి స్పిన్నర్ రాహుల్ సంఘ్వీ, రెండో స్పిన్నర్ వెంకటపతి రాజు, మూడో స్పిన్నర్ నీలేష్ కులకర్ణి అని చెప్పాడు. అనిల్ కుంబ్లే గాయం కారణంగా దూరం కావడంతో హర్భజన్ సింగ్ కు వికెట్లు తీసుకునే స్పిన్నర్ అయ్యాడని చెప్పారు. 

అప్పట్లో అనిల్ కుంబ్లే ప్రదర్శనను కూడా గంగూలీ గుర్తు చేశాడు. అనిల్ కుంబ్లే లాంటి బౌలర్ ఏ జట్టులో ఉన్నా పెద్దగా ప్రభావం చూపగలడని ఆయన అన్నారు సిరీస్ కు ముందు తాము చాలా కసరత్తు చేశామని, తమకు జాన్ రైట్ టార్గెట్ అని, హర్భజన్ సింగ్ చాంపియన్ మాదిరిగా బౌలింగ్ చేశాడని ఆయన అన్నారు హర్భజన్ సింగ్ మూడు మ్యాచుల్లో 32 వికెట్లు తీసుకుని మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికయ్యాడని చెప్పారు.