హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా శుక్రవారం జరిగిన భారత్- విండీస్ మ్యాచ్... క్రికెట్ ప్రియులందరినీ తెగ ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ లో రెండు జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. అయితే.. చివరకు విజయం టీమిండియాకే దక్కింది. ఈ విజయంపట్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆనందం వ్యక్తం చేశారు. 

తన సంతోషాన్ని ఇన్ స్టాగ్రామ్ లో... జట్టుతో దిగిన ఫోటోని పోస్టు చేసి తెలియజేశాడు. ఆ ఫోటోకి ‘‘ సిరీస్  ప్రారంభం అదిరింది. ఈ రోజు విజయంతో పాజిటివిటీ మరింత పెరిగింది’’ అని పేర్కొన్నారు. కాగా... కోహ్లీ ట్వీట్ కి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ స్పందించారు.‘‘ఈ సాయంత్రం నీట ఆట లో ఏదో ఉంది... బ్రో.. ఉద్వేగానికి గురిచేసింది’’ అంటూ కామెంట్ పెట్టారు.

ఇదిలా ఉండగా... నిన్నటి ఆట మధ్యలో... కోహ్లీ చేసిన ఓ ఫన్నీ రియాక్షన్ అందరినీ ఆకట్టుకుంది. విలియమ్స్ కి కోహ్లీ నోట్ బుక్ పంచ్ ఇచ్చాడు. 2017లో భారత్- వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో విలియమ్స్ విరాట్ ఔట్ అవ్వగానే... జేబులో నుంచి నోట్ బుక్ తీసి టిక్ మార్క్ చేసి సంబరాలు చేసుకున్నాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Good way to start the series. Lots of positives to take from today's win. 👍#INDvWI

A post shared by Virat Kohli (@virat.kohli) on Dec 6, 2019 at 10:30am PST

కాగా... నిన్నటి మ్యాచ్ లో... నోట్ బుక్ టిక్ మార్క్ కి కోహ్లీ సమాధానం ఇచ్చాడు. విలియమ్స్ బౌలింగ్ లో సిక్స్ కొట్టిన కోహ్లీ వెంటనే.. టిక్ మార్క్ చేస్తున్నట్లు యాక్ట్ చేసి సంబరాలు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కోహ్లీ బలే పంచ్ ఇచ్చాడంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు.