ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్‌ తనదైన ఆటతీరుతో జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. మాజీ క్రికెటర్లు, అభిమానులు సైతం అతని ఆటకు ముగ్ధులవుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే రావల్పిండి ఎక్స్‌ప్రెస్, పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మాత్రం స్మిత్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన కెరీర్‌లో చూసిన క్రికెటర్లలో ఎటువంటి టెక్నిక్, స్టైల్ లేని ఆటగాడు స్టీవ్ స్మిత్ ఒక్కడేనని పేర్కొన్నాడు. అయితే ఆధునిక క్రికెట్‌లో అత్యంత ప్రభావం చూపే క్రికెటర్ల జాబితాలో స్మిత్ కూడా ఒకడని అక్తర్ వ్యాఖ్యానించాడు.

కాగా పాకిస్తాన్‌లో జరుగుతున్న రెండో టీ20లో స్టీవ్ స్మిత్ 51 బంతుల్లోనే 80 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్పందించాడు.

Also Read:విరాట్ కోహ్లీని ఆకాశానికెత్తిన షోయబ్ అక్తర్

తాను రిటైరవ్వకముందు చాలా చాలా సందర్భాల్లో స్మిత్‌ను ఔట్ చేయడానికి ప్రయత్నించానని.. బౌన్సర్లు, యార్కర్లు వేశానని కాని అతని టెక్నిక్ ఏంటో అర్థం కాలేదన్నాడు. స్మిత్ ఆట ఏమాత్రం అలరించదని అక్తర్ వ్యాఖ్యానించాడు. అయితే అతని ధైర్యమే స్టీవ్‌ను ఒక అసాధారణ క్రికెటర్‌గా మార్చిందని ప్రశంసల జల్లు కురిపించాడు.

ఇటీవల జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ అమీర్ బౌలింగ్‌లో బంతి ఎక్కడైతే పడుతుందో.. సరిగ్గా అక్కడికే వచ్చి స్మిత్ ఆడాడని అక్తర్ గుర్తు చేసుకున్నాడు. ఈ ఆటతీరు తనను ఆశ్చర్యానికి గురిచేసిందని... స్మిత్ టీ20 ఫార్మాట్‌కు సరిపోడన్న వారికి తన ఆటతీరుతోనే స్టీవ్ స్మిత్ సమాధానం చెప్పాడని అక్తర్ పేర్కొన్నాడు. 

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ లో మార్పులు చేపడుతూ ఐసిసి తీసుకున్న నిర్ణయాన్ని పాాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ తప్పుబట్టాడు. ఈ నిర్ణయం టెస్ట్ క్రికెట్ ను బ్రతికించడం అటుంచితే హాని తలపెట్టే అవకాశాలున్నాయని అన్నాడు.

Also Read:రోహిత్ శర్మ ముందు సెహ్వాగ్ దిగదుడుపే: షోయబ్ అక్తర్

''టీ20ల రాకతో రోజురోజుకు పూర్తిగా ఆదరణ కోల్పోయిన టెస్ట్ క్రికెట్ ను బ్రతికించడానికే జెర్సీలో మార్పులు చేపట్టామని ఐసిసి అంటోంది. కానీ టెస్ట్ జెర్సీపై ఆటగాళ్ళ పేరు చేర్చడం సాంప్రదాయబద్దమైన టెస్టు  మ్యాచుల్లో ఎబ్బేట్టుగా అనిపిస్తోంది.

ఇలా టెస్టులను మరింత ఆకర్షణీయంగా మార్చడానికంటూ తీసుకున్న నిర్ణయం కాస్తా ఈ ఫార్మాట్ ను అభిమానులకు మరింత దూరం చేసేలా వుంది. కాబట్టి ఈ విషయంపై ఐసిసి పునరాలోచన చేయాల్సి అవసరం వుంది.'' అని అక్తర్ సూచించాడు